Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేతిక శర్మకు కలిసిరాని కాలం - ఐరెన్ లెగ్ అనే ముద్ర తప్పదా?

Advertiesment
kethika sharma
, ఆదివారం, 13 ఆగస్టు 2023 (13:33 IST)
చిత్రసీమ రాణించడానికి ప్రతిభతో పాటుగా అదృష్టం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో హీరోయిన్ కేతిక శర్మకు అన్యాయం జరుగుతోందేమో అనిపిస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకొనే కేతికకు ఎందుకనో లక్ కలసి రావడం లేదు. 'రొమాంటిక్', 'లక్ష్య', 'రంగ రంగ వైభవం' తదితర చిత్రాల్లో మెరిసింది కేతిక. ఆ సినిమాల్లో కేతిక గ్లామరకు మంచి మార్కులే పడ్డాయి. 
 
ముఖ్యంగా లుక్స్ విషయంలో తను తీసుకొనే కేర్ అందరికీ నచ్చింది. కాకపోతే ఆయా చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకపోవడం కేతిక కెరీర్‌కు మైనస్‌గా మారింది. ఇటీవల విడుదలైన 'బ్రో'లో మంచి అవకాశాన్నే అందుకొంది. 
 
సాయిధరమ్ తేజ్ సరసన కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోవడం, కేతిక రోల్‌కి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా పోయింది. దాంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర తనపై ఎక్కడ పడుతోందో అనే భయం నెలకొంది. 
 
'నా సినిమాలు కొన్ని సరిగా ఆడలేదు. కానీ వాటిలో నా ప్రయత్నలోపం అయితే లేదు. ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా అడదో చెప్పలేం. ఆయా చిత్రాల విషయంలో నా నిర్ణయాలు ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు. కానీ ఆ సినిమాల్ని ఒప్పుకొనే రోజున వాటిపై నాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది' అని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథల ఎంపికలో బోల్తాపడుతున్న హీరో అఖిల్ అక్కినేని!!