Samantha terrace gardening
ఎంత సంపాదించినా ఏం లాభం. అవసరానికి తినడానికి కనీసం కాయగూరలు, ఆకుకూరలు లేకుండా బజారు వెంట పడుతున్న ప్రజల్ని చూసి చలించిపోయానంటోంది సమంత అక్కినేని.
కోవిడ్-19 సమయంలో లాక్‌డౌన్ పెట్టినప్పుడు దేశమంతా సామాన్యల పాట్లు చూస్తుంటే నేను చైతన్య చలించిపోయాం. గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్ ఉంటుందని తెలిసి అందరూ సరుకులు, కూరగాయల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి.
అలాంటి సమయంలో ఇంత సంపాదించి ఏం లాభం. సరిగ్గా భోజనం కూడా తినలేనప్పుడు అని చై, నేను అనుకున్నాం. అలా, నేను టెర్రస్ గార్డెనింగ్ ప్రారంభించాను. ఆ తర్వాత నుంచి వెజిటేరియన్‌గా మారాను. షూటింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉంటే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అని సమంత తెలిపారు.
సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మేన్-2తో ఓటీటీలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రమోషన్‌లో ఆమె పలు విషయాలు వెల్లడించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా ఆపివేయమని కేంద్రాన్ని కోరింది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.