Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

బోల్డ్ సన్నివేశం ఉంటే.. క్లారిటీ ఇస్తేనే చేస్తాను : ఎరికా ఫెర్నాండెజ్

Advertiesment
Erica Fernandes
, శుక్రవారం, 28 మే 2021 (16:33 IST)
'కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ'తో బుల్లితెర మీద తన ప్రయాణం మొదలు పెట్టింది ఎరికా ఫెర్నాండేజ్‌. దీనికి కొనసాగింపుగా వచ్చిన రెండో సీజన్‌లోనూ ఎరికానే నటించింది. 2018లో ప్రారంభమైన కసౌటీ జిందగీ కే 2వ సీజన్‌లోనూ తన నటనతో మెప్పించింది. ఈమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, బోల్డ్ సన్నివేశాలపై స్పందించింది. 
 
సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాల్సిందే. ముఖ్యంగా వెండితెరపై అందాలు ఆరబోయాల్సిందే. అలాగే, బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన పరిస్థితి ఎదురైతే తప్పక నటించాల్సిందే. ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న ట్రెండ్. నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాల్సిందేనని చెబుతోంది. 
 
గ్లామర్‌, డీగ్లామర్‌, ఛాలెంజింగ్‌.. ఇలా అన్నిరకాల పాత్రలను అంగీకరించి తీరాల్సిందే. ప్రేక్షకుల మనసు దోచుకోవాలంటే జనాలు మెచ్చే సినిమాలు చేయాల్సిందే! అయితే ఎలాంటి సన్నివేశంలోనైనా అలవోకగా నటించే హీరోయిన్లు బోల్డ్‌ సీన్లు వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 
 
ఈ పాత్రలపై ఆమె మాట్లాడుతూ, అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్‌ అవుతానని తెలిపింది. తనకు ఇప్పటివరకు అలాంటి పాత్రలు చాలా తక్కువగా వచ్చాయని, వాటిలో చాలామటుకు నో చెప్పానని తెలిపింది. కొన్ని బోల్డ్‌ సన్నివేశాలను కావాలని బలవంతంగా చొప్పిస్తారని, అలాంటప్పుడు ఆ సీన్లలో నటించేందుకు నిరభ్యంతరంగా తిరస్కరిస్తానని స్పష్టం చేసింది. 
 
ఒకవేళ అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే బోల్డ్‌ సన్నివేశం ఎందుకు అవసరమనేది ముందు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజంగానే అది తప్పనిసరి అనిపించినప్పుడు మాత్రమే అందులో నటించేందుకు నేను మానసికంగా సిద్ధమవుతాను. అంతేకానీ కథ డిమాండ్‌ చేయకపోయినా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిందే అంటే అందుకు అస్సలు ఒప్పుకోను అని తేల్చి చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధ‌ర్మం లోపించింది అందుకే రామ‌దండ‌కం పాడాః బాలకృష్ణ