Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

గాడ్ ఫాదర్ క్లైమాక్స్ నచ్చలేదుః సీక్రెట్ చెప్పిన చిరంజీవి

Advertiesment
chiru with filmcrtics
, బుధవారం, 12 అక్టోబరు 2022 (13:17 IST)
chiru with filmcrtics
గాడ్ ఫాదర్ అంత విజయం సాధించడం వెనుక జనానికి నచ్చిన, వారు మెచ్చిన అంశాలెన్నో ఉన్నాయని, కథలో మోహన్ రాజా చేసిన మార్పుల వల్లే ఇది సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన పోషించిన బ్రహ్మ పాత్రకు ఆబాలగోపాలం ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆభినందించేందుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన ఇంటికి వెళ్లింది. అప్పుడు చిరంజీవి మ‌న‌సులోని మాట‌ల‌ను కూలంక‌షంగా ఇలా తెలియ‌జేశారు.
 
‘సినిమా కథ అనేది అరటిపండు వలిచినట్టుండాలి. ఎక్కడా ఎలాంటి సందిగ్ధతా ఉండకూడదు. సన్నివేశాల పరంగా ఏది ఎప్పుడు రివీల్ చేయాలనేది ముందుగానే అనుకున్నాం. ఫైనల్ కాపీ చూశాక కూడా చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ముందు షూట్ చేసిన క్లైమాక్స్ నాకు నచ్చలేదు. విలన్ అనుకున్న ఇంటర్నేషనల్ డాన్ వచ్చి బ్రహ్మకు సలాం చేయడమేంటి? అని సత్యదేవ్ పాత్ర అవాక్కవుతుంది. నీ భర్త నా ఎదురే ఉన్నాడు ఏం చేయమంటావమ్మా అని నయన తారతో అంటాను. ఈ తాళి ఉండకూడదన్నయ్యా అని ఆమె తెంపేయడం, నేను గన్ తీసుకుని సత్యదేవ్ క్యారెక్టర్ ను కాల్చేయడం ఒక వెర్షన్, అతనే గన్ తీసుకుని తనను తాను కాల్చుకోవడం... లాంటి వెర్షన్లు చేశాం. అప్పటికే అతను జీవచ్ఛవంలా ఉన్నాడు. అలాంటి అతన్ని ఇద్దరు సూపర్ స్టార్స్ చంపడం ఏంటి అనిపించింది. అది నాకస్సలు నచ్చలేదు. ‘ఫినిషింగ్ నచ్చలేదు రాజా’ అన్నాను. 
 
వేట సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్ర విషయంలో ఇాలాంటిదే జరిగింది. అతను చాలా లోభి.. క్లైమాక్స్ లో అతని ముందు బంగారు నాణేలు విసిరి తిను తిను అంటాను. అది నాకు చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్. అందుకే క్లైమాక్స్ మార్చమని కోరాను. నయన తార కారులో రోడ్డు మీద వస్తుంటే కిల్ హర్ అంటాడు సత్యదేవ్. కానీ అది కూడా జరగదు. తన మామను చంపి నట్టుగానే ఇన్ హేలర్ తో తనకి తానే చంపుకునేలా మోహన్ రాజా చేసిన మార్పు మా అందరికీ బాగా నచ్చింది. త్రీ వీక్స్ బ్యాక్ ఆ షాట్ చేశాం. క్లైమాక్స్ ఇలా మార్చినందుకు వీరందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. లూసీఫర్ లోని చాలా అంశాల్లో మార్పులు చేయడం వల్లే మన నేటివిటీ తగ్గట్టుగా సినిమా వచ్చిందని చిరంజీవి వివరించారు. తను నటించిన చిత్రాల్లో టాప్ 5లో గాడ్ ఫాదర్ ఉంటుందని అన్నారు.
 
చిరంజీవిని క‌లిసిన‌వారిలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్ పామర్తి, ఉపాధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ ఎస్. నారాయణరెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు కె. లక్ష్మణ రావు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ఎ. ప్రభు, కార్యవర్గ సభ్యులు  ధీరజ్ అప్పాజీ, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లికార్జున్, రమేష్ చందు, సిహెచ్. నవీన్, రవి గోరంట్ల, బి. శివకుమార్ తదితరులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. గాడ్ ఫాదర్ మెగా విజయం సాధించినందుకు అభినందనలు తెలిపి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజలి బాగా సన్నబడిందే.. చెర్రీ సినిమా లుక్ లీక్