ఆ క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్లవుతుందా లేకుంటే అమ్మాయిలకు పెళ్లి కాదా అని మూడు పదుల నటి శ్రీయ ప్రశ్నిస్తోంది. పైగా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించబోనని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తాను ఆది నుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలకు వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆ మధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని తెలిపింది. తొలుత ఆ కమర్షియల్ ప్రకటనలో నటించాలని తననే సంప్రదించారని, దాన్ని తాను తిరస్కరించానని చెప్పింది.
దీనిపై ఆమె స్పందిస్తూ, 'సదరు క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయం. అది స్వతహాగానే వస్తుంది తప్ప ఏ క్రీమ్‌లు వాడినా రాదు. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా నేను ఒప్పుకోను' అని తేల్చి చెప్పింది.