Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

Advertiesment
dsureshbabu

ఠాగూర్

, ఆదివారం, 12 జనవరి 2025 (11:33 IST)
సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్‌లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న  హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు.. ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 
 
కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్‌పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452, 458, 120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు. 
 
గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడు నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా, 2022 నవంబరులో జిహెచ్‌ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని.. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ..2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసింది.
 
దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్‌లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నంద కుమార్ ఏండ్లుగా పోరాడుతున్నారు. కాగా, శనివారం 11న నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని.. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)