Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొంత మంది దర్శకులకు క్లారిటీ వుండదు - ఒక్కోసారి కష్టపడ్డా నొక్కేస్తారు? శ్రీరామ్ కామెంట్

Advertiesment
hero Sriram
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:17 IST)
hero Sriram
చాలమంది నటీనటులు తాము సినిమా చేస్తే ప్రాణం పెట్టి చేస్తారు. అందులో యాక్షన్ సీన్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. చాలా మంది కథానాయకులు రోప్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకడం, పరిగెత్తడం చేస్తుంటారు. దర్శకుడు చెప్పిన సీన్ బాగా రావాలని పట్టుదలతో ఆ నటుడు వుంటాడు. కానీ పడ్డ కష్టానికి ఫలితం లేకుండా ఆ సీన్ రిలీజ్ టైంలో తీసేస్తే ఆ నటుడికి ఎంత బాధ కలుగుతుందో తెలియంది కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో నటుడికి ఒక్కో కథ తెరవెనుక వుంటుంది. టైం వచ్చినప్పుడు మనసు విప్పి మాట్లాడతారు.
 
తాజాగా ప్రముఖ కథానాయకుడు శ్రీరామ్ ఈ విషయమై స్పందించారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, నాగచైతన్య హీరోగా దడ సినిమా చేశాను. అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిని నమ్మి ఆ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేశాను. నా కాలు కూడా పాక్చర్ అయింది. ఓ బిల్డింగ్ నుంచి ఆరవ ఫ్లోర్ నుంచి మూడవ ఫ్లోర్ కిందకు దూకి మరలా అక్కడనుంచి దూకాలి. రోప్ లేకుండా చేశాను. ఆ సీన్ కోసం ఉదయం 7 గంటలకు షాట్ రెడీ అయితే అలా మధ్యాహ్నం వరకు సాగింది. అలా రెండు రోజులు షూటింగ్ జరిగింది. చాలా ఎనర్జీ పెట్టి పట్టుదలతో చేశాను. 
 
కానీ ఆ తర్వాత దర్శకుడు ఆ సీన్ కట్ చేశాడు. అదేమని అడిగితే సరైన సమాధానం లేదు. ఆ తర్వాత తెలిసింది ఏమంటే, నా సీన్ సినిమాకు డామినేట్ అవుతుందని అన్నారు. ఇలాంటి సన్నివేశాలు పలు సినిమాల్లో జరుగుతాయి. అలా అని నేను సినిమా చేయను అంటే.. నా మీద పెద్ద బ్లేమ్ చేస్తారు. అందుకే నా ముందుకు దర్శకుడు కథ చెబితే, చెప్పినట్లు తీయగలవా? అని అడుగుతాను. మధ్యలో ఏదైనా తేడా వుందని గమనిస్తే సామరస్యంగా తప్పుకుంటాను. ఇది అందరూ గమనించాలి అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించాడు. తాజాగా ఆయన నటించిన పిండం సినిమా ఈనెల 15 న విడుదల కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోర్ కొట్టే జబర్దస్త్ పేస్ లతో కామెడీ ఎక్సేంజ్ 2 చేస్తున్న అనీల్ రావిపూడి