కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతికి కారణం ఏమైవుంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, పునీత్ హెవీ వర్కౌట్సే చేయడమే కారణంగా భావిస్తున్నారు.
పునీత్ అన్న శివరాజ్‌కుమార్ కూడా ఇలాంటి వర్కౌట్స్ చేసి గుండెపోటుతో మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చాడు. శివరాజ్ కూడా కన్నడలో పెద్ద స్టార్. పునీత్, శివరాజ్ ఇద్దరూ కన్నడ కంఠీరవ, సూపర్ స్టర్ రాజ్‌కుమార్ కొడుకులే.
పునీత్‌లాగే ఆయన అన్న శివరాజ్‌కు కూడా 54 ఏళ్ల వయసులో 2015లో జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయనను వెంటనే బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. దేవుడి దయవల్ల ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివరాజ్ జిమ్ జోలికి వెళ్లలేదు.
అప్పట్లో వారి తండ్రి, కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ కూడా 77 ఏళ్ల వయసులో ఇదే రకంగా గుండె పోటుతో మరణించారు. ఇప్పడు పునీత్ రాజ్‌కుమార్ కూడా ఆయన ఇంట్లోనే జిమ్‌లో వ్యాయామం చేస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
టీవీల్లో ప్రసారం అవుతున్న పునీత్ చేసే వ్యాయామం విజువల్స్ చూస్తే అర్థముతోంది. అయన ఎంత భారీ వర్కౌట్స్ చేస్తున్నారో. అదే ఇప్పుడు ఆయన ప్రాణాల మీదికి వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.