రాజ్ తరుణ్, దర్శకుడు కొండా విజయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ `పవర్ ప్లే`. పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై మహిదర్, దేవేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈచిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని యూఎస్ఎ.లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండగా ఆస్ట్రేలియాలో సథరన్ స్టార్ ఇంటర్‌నేషనల్, మిడిల్ ఈస్ట్‌లో మను రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో జరిగింది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె రాధామోహన్ మాట్లాడుతూ - ``ఈ టీమ్‌తో మా బేనర్‌లో ఒరేయ్ బుజ్జిగా మూవీ చేశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు హోమ్ ప్రొడక్షన్ అనిపిస్తోంది. ప్రోమోస్, ట్రైలర్ చూస్తుంటే రాజ్ కొంత రఫ్ అయ్యాడనిపిస్తోంది. ఈ సినిమా మహిధర్, దేవేష్‌కి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను` అన్నారు.
రచయిత నంధ్యాల రవి మాట్లాడుతూ - ``ఈసారి కామెడీ కాకుండా డిఫరెంట్ జోనర్‌లో సినిమా చేద్దాం అని రాజ్ తరుణ్ చెప్పగానే నేను, విజయ్ కలిసి ఈ కథ రెడీ చేయడం జరిగింది. ఈ సినిమాకి అన్ని చాలా బాగా కుదిరాయి. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇది ఆర్టిస్టులు సినిమా అన్నారు.
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - ``చిత్ర నిర్మాత మహిధర్ మా సినిమాల్ని ఓవర్సీస్లో రిలీజ్ చేస్తుంటారు. ఈ సినిమాని దేవేష్ సాయంతో సియాటెల్ నుండే నిర్మించాడు. ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పినప్పుడు జాగ్రత్తగా చేయి అని చెప్పాను. అదే బడ్జెట్‌లోనే సినిమా కంప్లీట్ చేశాం అని రీసెంట్‌గా చెప్పాడు. చాలా ఆశ్చర్యమేసింది. ట్రైలర్ చూశాక కొండా విజయ్‌కుమార్ ఆలోచనలు మారిపోయాయి అనిపించింది. ఎందుకంటే రాజ్‌తరుణ్ తో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను`` అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ - ``ఇలాంటి ఒక క్యారెక్టర్ని నేను ఇంతవరకూ చేయలేదు. విజయ్‌గారి లాంటి స్వీట్ డైరెక్టర్‌ని నేను ఇంత వరకూ చూడలేదు. ఒక డైరెక్టర్ ఇంత కామ్‌గా వర్క్చే యడం నేనింతవరకూ చూడలేదు`` అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ - రాజ్ తరుణ్ ఇప్పటివరకూ కామెడీ, లవ్‌స్టోరీ సినిమాలే చేశాడు. ఈ లాక్‌డౌన్‌లో అందరూ వరల్డ్ సినిమాలు చూశారు. కాబట్టి కొత్తగా సినిమా చేసి మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకోవాలి అని ఈ సినిమా చేయడం జరిగింది. రాజ్, నేను ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్. నేను నంధ్యాల రవి, రాజ్ కలిసి ఈ సినిమా అనుకున్నప్పుడు ఆడియన్స్ ఈ సినిమాకి ఎందుకు రావాలి అని అనుకున్నాం. ఇది ఒక మ్యూజికల్ సినిమా. కెమెరా పరంగా మేకింగ్ స్టైలిష్‌గా ఉండే సినిమా. ఇప్పటి వరకూ కామెడీ చేసిన నటుల్ని కొత్తగా ఆవిష్కరించే సినిమా. అలాగే ప్లాన్ చేశాం. ఫస్ట్ టైమ్ రాజ్‌లో ఇంకో యాంగిల్ చూస్తారు. హేమల్ చాలా బాగా నటించింది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో పూర్ణ నటించింది. ఇప్పటి వరకూ మీరు చూడని పూర్ణగారిని చూస్తారు. ప్రిన్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆండ్రూ గారు తన సినిమాలకి విభిన్నంగా ఈ సినిమా చేశారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి కథను మాత్రమే ఫాలో అవుతారు. సురేష్ బొబ్బిలి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. రియల్ సతీష్ నేచురల్‌గా ఫైట్స్ కంపోజ్ చేయడం జరిగింది. సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. సినిమా సూపర్‌డూపర్ హిట్. మార్చి 5న థియేటర్లలో కలుద్దాం`` అన్నారు.