హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే జిన్నా టీజర్ విడుదలైంది. తాజాగా వీడియో సాంగ్ `గోలీసోడావే గుండెను మత్తెక్కించే పానీబీడావే` అంటూ పాట రాబోతుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఇందులో మంచు విష్ణు పాయల్‌ను మత్తుగా పట్టుకుంటూ సాగే పాటలో పలువురు డాన్సర్లు విష్ణు తరహాలో మత్తెక్కించేలా వున్నారు. ఈ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మాంచి స్పందన లభిస్తోంది. చాలా కాలం తర్వాత విష్ణు చేస్తునన సినిమాలో యూత్‌ను మత్తెక్కించే అంశాలున్నాయంటూ స్పందిస్తున్నారు. సెప్టెంబర్ 19న ఫుల్ సాంగ్ విడుదలకాబోతుంది. మరి ఈ సాంగ్ విడుదల తర్వాత ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.