Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ విష్ణు కు గీతా ఆర్ట్స్ గిఫ్ట్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా శ్వాగ్

Sri Vishnu -  Swag

డీవీ

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (16:44 IST)
Sri Vishnu - Swag
ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న హీరో శ్రీవిష్ణు, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్ డే ప్రజెంటేషన్ అందుకున్నారు. 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే అతని నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది . గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
#SV18  గ్రాండ్ రివీల్ వీడియో ద్వారా చేశారు. గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి గిఫ్ట్  అందుతుంది. గిఫ్ట్ బాక్స్ లోపల ఒక పజిల్ ఉందని తెలుసుకున్న శ్రీ విష్ణు ఆ  పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు. చాలా కాలంగా బిగ్ బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది ఖచ్చితంగా బిగ్ బర్త్ డే ప్రెజెంటేషన్.
 
#SV18 ఒక మంచి ప్రేమకథతో పాటు ఫన్ రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతుంది. ప్రముఖ టెక్నీషియన్లు ఈ క్రేజీయస్ట్ కాంబినేషన్ లో సినిమా కోసం పని చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.
 
అదేవిదంగా శ్రీ విష్ణు, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32 టైటిల్ 'శ్వాగ్'-హ్యుమరస్ కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. సింహం నుండి కిరీటం తీసుకున్న తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవడం గురించి అడవిలో జంతువుల మధ్య ఫన్నీ సంభాషణను చూపే కాన్సెప్ట్ వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ చేశారు. సింహం పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, కోతి పాత్రకు గంగవ్వ వాయిస్ ఓవర్ ఇచ్చింది. చివరగా, టైటిల్ 'శ్వాగ్' అని రివీల్ అయ్యింది.
 
రాజుగా కనిపించిన శ్రీవిష్ణు కాన్సెప్ట్ వీడియోలో ''మగవాడి ఉనికిని నిలబెట్టిన మా శ్వాగణిక వంశానిది' అని చెప్పిన డైలాగు ఆకట్టుకుంది.  
 
టీజర్, హిలేరియస్  కాన్సెప్ట్ వీడియోను బట్టి చూస్తే, శ్వాగ్ చిత్రం యూనిక్  కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్ధమౌతోంది.
 
రాజ రాజ చోరా కోసం పనిచేసిన దాదాపు అదే టీమ్  'శ్వాగ్' కోసం కూడా పని చేస్తుంది. వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.
 ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్ లో మూడో సినిమా