Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్యాంగ్ లీడర్ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో తెలుసా?

Advertiesment
గ్యాంగ్ లీడర్ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో తెలుసా?
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (15:30 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలైంది. జెర్సీ సినిమాతో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న నాని.. గ్యాంగ్ లీడర్‌ చిత్రం కోసం డైరక్టర్ విక్రమ్ కే కుమార్‌తో చేతులు కలిపారు. ఈ సినిమాలో హీరో కార్తీకేయ, నూతన తార ప్రియాంక మోహన్ కూడా కలిసి నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌, మోహన్‌(సీవీఎం) నిర్మించారు. ఇక ఈ సినిమా కథను ఓసారి పరిశీలిస్తే.. 
 
ప్రతీకారం కోసం తమ కుటుంబాలకు అన్యాయం చేసిన వారి కోసం సరస్వతి (లక్ష్మీ), వరలక్ష్మి (శరణ్య), ప్రియ (ప్రియాంక మోహన్) సిద్ధమవుతారు. ఈ క్రమంలో పెన్సిల్ పార్థసారథి (నాని) అనే క్రైమ్, థ్రిల్లర్ రచయితను కలిసి తమ ప్లాన్ వివరిస్తే నిరాకరిస్తాడు. కానీ స్వప్రయోజనం కోసం మహిళా గ్యాంగ్‌ ప్లాన్ ఓకే చెబుతాడు. ఆ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ నుంచి అంతర్జాతీయ కారు రేసర్‌గా ఎదిగిన దేవ్ (కార్తీకేయ) తమకు అన్యాయం చేసిన వ్యక్తి అని గుర్తిస్తాడు. కారు రేసర్ దేవ్ ఎందుకు ఐదుగురు కుటుంబాలను రోడ్డున పడేశాడు. 
 
రూ.300 కోట్ల బ్యాంక్ దోపిడికి ఈ మహిళల కుటుంబాలకు సంబంధమేమిటి? బ్యాంక్ దోపిడికి అంబులెన్స్ డ్రైవర్ దేవ‌కు సంబంధం ఏమిటి? ఇంటర్నేషనల్ రేసర్‌గా దేవ్ ఎలా మారాడు? గ్యాంగ్ లీడర్‌గా మారిన నాని ఐదుగురు మహిళల కోసం ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు. ఐదుగురిలో ఒకరైన ప్రియతో ప్రేమలో పడిన పార్థసారథి తన లవ్‌ను గెలిచాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ : 
నాని గ్యాంగ్ లీడర్‌కు దర్శకుడు విక్రమ్ కుమార్ కథ, కథనాలను బలంగా రాసుకోలేకపోయాడని తెలుస్తోంది. సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సాదాసీదాగా సాగడం ద్వారా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడనిపిస్తుంది. కథలో ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. అశ్లీలత, అసభ్య సంభాషణలు, అనవసరపు రొమాన్స్‌కు మొగ్గు చూపకపోవడం దర్శకుడిగా కొంత సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఈ అంశమే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రప్పించడానికి అవకాశం కనిపిస్తున్నది. 
webdunia
 
ఇక నాని విషయానికి వస్తే.. తన పాత్ర బరువునే కాకుండా మరో ఐదుగురి పాత్రల బరువును కూడా మోసినట్టు కనిపిస్తుంది. కథ, కథనాలపై ఇంకాస్త జాగ్రత్త పడివుండాల్సింది. కథలో ఎలాంటి బలం లేకపోయినా నాని సినిమాను నిలబట్టే ప్రయత్నం చేశాడని అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రలు తమ పాత్రలకు ఒదిగిపోయారు.
 
ప్లస్ :
నాని యాక్టింగ్
ఫస్ట్ హాఫ్
కామెడీ
 
మైనస్ :
కథ - కథనం
సెకండ్ హాఫ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో రమ్యకృష్ణ క్వీన్... వార్నింగ్ ఇచ్చిన 'అమ్మ' మేనల్లుడు