Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనుమాన్ స్థాయిలో గదాధారి హనుమాన్ హిట్ అవుతుంది : సి. కళ్యాణ్

Advertiesment
C Kalyan and Gadadhari Hanuman team

దేవీ

, శుక్రవారం, 11 జులై 2025 (19:13 IST)
C Kalyan and Gadadhari Hanuman team
రవి కిరణ్ హీరోగా నటించిన మైథలాజికల్ చిత్రం  ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
webdunia
Raj kandukuri and Gandara hanuman team
సి. కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘హనుమాన్’ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హనుమాన్‌ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఇలాంటి ఓ టైటిల్‌ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.
 
హీరో రవి కిరణ్ మాట్లాడుతూ, మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నాను. తారకాసుర చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
నిర్మాత బసవరాజ్ హురకడ్లి మాట్లాడుతూ, కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. రవి కిరణ్ అద్భుతంగా నటించారు. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా పట్ల మేం సంతోషంగా ఉన్నాం. ఆడియెన్స్ ముందుకు ఈ చిత్రాన్ని త్వరలోనే తీసుకు వస్తాం అని అన్నారు.
 
దర్శకుడు రోహిత్ కొల్లి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశాను. బసవ సర్‌తో ఈ జర్నీ ప్రారంభమైంది. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్