Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్న జనసేన - టీవీ రామారావుపై వేటు

Advertiesment
jana sena party

ఠాగూర్

, శుక్రవారం, 11 జులై 2025 (17:45 IST)
జనసేన పార్టీ క్రమశిక్షణకు పెద్దపీట వేస్తోంది. ఆ పార్టీ నేతలు ఏమాత్రం పార్టీ లైన్ దాటితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత కొవ్వూరు అసెంబ్లీ స్థానం ఇన్‌‍చార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అనుమతి లేకుండా, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకున్నందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టి.వి.రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళన చేశారు. కొవ్వూరు టోల్‌గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. వీటిలో మూడు పదవులు తమకు కేటాయించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టి.వి. రామారావు డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో ఆందోళన నిర్వహించారు. అయితే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా టి.వి. రామారావు ఆందోళన చేయడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది.
 
పార్టీ విధి విధానాలకు భిన్నంగా టి.వి.రామారావు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చిందని వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగేలా చర్యలు ఉన్నందున పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడం జరిగిందన్నారు. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావును ఆదేశించారు.
 
కాగా, టి.వి.రామారావు 2009 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక కేసు కారణంగా రాజకీయ ఒడిదుడుకులకు గురైన ఆయనకు పార్టీ టికెట్ లభించలేదు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో కె.ఎస్.జవహర్ గెలుపుకు మద్దతుగా ప్రచారం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Crocodile: మధ్యప్రదేశ్‌లో మహిళను పొట్టనబెట్టుకున్న మొసలి