Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటికి చేరుకున్న లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఫాలోవర్లు

Advertiesment
Followers
, మంగళవారం, 9 నవంబరు 2021 (21:39 IST)
బాహుబలి-ఫేమ్ లేడీ సూపర్ స్టార్, అనుష్క శెట్టి భారతదేశం యొక్క మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ(koo)లో తనదైన ముద్ర వేశారు. జూన్ 2021లో కూ(koo)లో తన అఫీషియల్ ప్రొఫైల్ - @msanushkashetty - క్రియేట్ చేసినప్పటి నుండి, విపరీతమైన ఫాలోయింగ్ పొందుతూ కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను  అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత మహిళా సెలబ్రిటీగా నిలిచారు.
 
భారతదేశం నలుమూలలా ఉన్న అభిమానులు ఈ మైలురాయిని చేరుకున్నందుకు అనుష్కను అభినందించారు. పలువురు అభిమానులు ఆమె అద్భుతమైన పెర్ఫార్మన్స్ మరియు కమర్షియల్ సక్సెస్ గుర్తుచేసుకుంటూ కామెంట్స్ చేశారు. అనుష్క ఇటీవల ఒక పోస్ట్ చేస్తూ తన రాబోయే చిత్రం #Anushka48 దర్శకుడు పి.మహేష్ బాబుతో అని అప్డేట్ ఇస్తూ పోస్ట్ చేసింది.
 
కూ(koo) ప్రతినిధి మాట్లాడుతూ, “అనుష్క గారు మా ప్లాట్‌ఫారమ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్లను చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్లాట్‌ఫారమ్ నిజమైన ఫాలోవర్‌గా కనెక్షన్‌లను ఏర్పరచుకోవడానికి భాషాపరమైన అడ్డంకులను అధిగమించే సందేశాన్ని ప్రచారం చేయడంలో కూ(koo)కు సహాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె భావాలను వ్యక్తపరచడంలో టార్చ్ బేరర్ ఉంటున్నారు.
 
ప్లాట్‌ఫారమ్ పైన సంకోచం లేకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మేము ఆమె మద్దతును అభినందిస్తూ ఆమె మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని కోరుకుంటున్నాము. మా బహుభాషా ఫీచర్లు ఆమెకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో కనెక్ట్ అవ్వడంలో మరింత సహాయపడతాయని మేము నమ్ముతున్నామన్నారు.
 
2005లో ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, బాహుబలి - ది బిగినింగ్ మరియు బాహుబలి - ది కన్‌క్లూజన్‌లో ప్రధాన పాత్రలు పోషించిన దక్షిణ భారత సూపర్ స్టార్ అనుష్క శెట్టి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓరి దేవుడా మోషన్ పోస్టర్.. విజయ్ సేతుపతి పాత్రలో స్టార్ హీరో