మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మూహుర్తం ఖరారు చేశారు. 'బాస్ పార్టీ' పేరుతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి సరసన శృతిహాసన్, కేథరిన్ టెస్రాలు నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్‌లో నర్తించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి.
గతంలో చిరంజీవి, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిదే. దీంతో ఇపుడు "వాల్తేరు వీరయ్య"పై ఒక్కసారిగా అంచనాలు మిన్నంటయ్యీయి.