Thimmarajupalli TV look poster
సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.
సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి.మునిరాజు కిరణ్ అబ్బవరం మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవారు.
"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
నటీనటులు - సాయి తేజ్, వేద శ్రీ, ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు, లతీష్ కీలపట్టు, రాజశ్రీ మడక, కేఎల్ మదన్, అన్షుమన్, రఘురామవాసి, బాలరాజు పులుసు, సాయికృష్ణ సంగపు, కరిశ్మ నెల్లూరు, ఆర్. వశిష్ఠ్