Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీ, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా మార్షల్ చిత్రం పూజతో ప్రారంభం

Advertiesment
Karthi, Kalyani Priyadarshan

దేవీ

, గురువారం, 10 జులై 2025 (17:40 IST)
Karthi, Kalyani Priyadarshan
సత్యం సుందరం తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రకాష్ బాబు , SR ప్రభు నిర్మిస్తారు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తీ ని ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్ తో మేకర్స్ ఈరోజు 'మార్షల్' అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈరోజు శుభ పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
 
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్షల్‌ను అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం: కార్తీ, కళ్యాణి ప్రియదర్శన్, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రొమాన్స్‌, కామెడి, డ్రామా గా లవ్‌స్టోరీ తో ఉసురే చిత్రం