Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరీ ఇంత రొమాంటిక్కా.. ఫస్ట్ లుక్‌పై సోషల్ మీడియాలో ఒకటే రచ్చ

Advertiesment
పూరీ ఇంత రొమాంటిక్కా.. ఫస్ట్ లుక్‌పై సోషల్ మీడియాలో ఒకటే రచ్చ
, గురువారం, 3 అక్టోబరు 2019 (14:59 IST)
పోకిరి దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ మూడో సినిమా రొమాంటిక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌పై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహించే ఈ సినిమాలో కేతికా శర్మ కథానాయిక. పూరీ కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. 
 
పూరి స్కూల్ నుండి వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ కేతికా శర్మ దశ కూడా ఈ ఒక్క సినిమాతో మారిపోతుంది అనిపిస్తుంది రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఎక్స్‌పోజింగ్ అనే మాటని పీక్స్‌లో ప్రెసెంట్ చేసి చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ఆ ఫస్ట్ లుక్‌ని ప్రెజెంట్ చేసారు. 
 
ఆ పోస్టర్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. ఆకాశ్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఆ హాట్ కౌగిలి ఆవిరిలోని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు రొమాంటిక్ హీరో ఆకాశ్ పూరి.
 
కానీ ఆ ఫస్ట్‌లుక్‌పై నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కుర్రాళ్ళు. ఇస్మార్ట్ శంకర్‌తో విజయం అందుకున్న పూరి కనెక్ట్స్‌కి ఈ సినిమా కూడా అదే రేంజ్ విజయం అందించబోతుందనే విషయాన్ని ఈ పోస్టర్‌ని చూస్తే తెలుసుకోవచ్చు. ఈ పోస్టర్ పై ప్రస్తుతం నెట్టింట పెద్ద రచ్చే జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరును ఆకాశానికెత్తేసిన దర్శకేంద్రుడు... ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మెగాస్టార్