Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Advertiesment
Vijay Antony, Leo John Paul, Ajay Dheeshan

దేవీ

, బుధవారం, 2 జులై 2025 (16:58 IST)
Vijay Antony, Leo John Paul, Ajay Dheeshan
విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో తన మేనల్లుడు అయిన అజయ్ ధీషన్‌ను విజయ్ ఆంటోని తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పించారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది.
 
ఈ క్రమంలో హైదరాబాద్ లో థాంక్యూ మీట్ లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ సినిమాను సురేష్ బాబు గారు, రామాంజనేయులు గారు చాలా గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేశారు. ఇకపై నా సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేస్తానని సురేష్ బాబు గారు అన్నారు. నాకు ఇంత మంచి మూవీని ఇచ్చిన లియో జాన్ పాల్‌కు థాంక్స్. అజయ్‌ను ఇంత బాగా లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు, తమిళంలో అజయ్‌కు మంచి పేరు వచ్చింది. అజయ్ ఇకపై ఇలానే మంచి కంటెంట్ చిత్రాల్ని చేస్తూ ఆడియెన్స్‌ నుంచి ప్రేమను సంపాదిస్తూనే ఉండాలి. బిచ్చగాడు 2, రోమియో చిత్రాలకు అజయ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. అజయ్‌తో కలిసి నేను ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని నిర్మిస్తాను. తమిళంలో ప్రస్తుతం ఏడు చిత్రాల్ని చేస్తున్నాను. అందులో తెలుగు డబ్బింగ్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. త్వరలోనే ‘భద్రకాళి’ రానుంది. అదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. నేను బిన్నమైన కథలు ఎంపికచేసుకుంటున్నా నాలో రొమాంటిక్ హీరో దాగివున్నాడు. త్వరలో ఆతరహా సినిమా చేస్తానని అన్నారు.
 
అజయ్ ధీషన్ మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ సినిమాకు తెలుగులో ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు. ఇది తమిళ చిత్రం అయినా కూడా తెలుగు ఆడియెన్స్ పెద్ద విజయాన్ని అందించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి, ఫాతిమా విజయ్ ఆంటోని గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన లియో జాన్ పాల్ గారికి థాంక్స్. మా మూవీని తెలుగులో ఇంత బాగా రిలీజ్ చేసిన సురేష్ బాబు గారు, రానా గారు, రామాజంనేయులు గారికి థాంక్స్’ అని అన్నారు.
 
లియో జాన్ పాల్ మాట్లాడుతూ* .. ‘విజయ్ ఆంటోనీ గారు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. ఇది హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో భారీ ఎత్తున నిర్మించిన చిత్రం. డబ్బింగ్ విషయంలోనూ ఆయన ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. అజయ్ అద్భుతంగా నటించారు. తెలుగులో ఇంత పెద్దగా రిలీజ్ చేసిన సురేష్ బాబు గారు, రామాజంనేయులు గారికి థాంక్స్’ అని అన్నారు.
 
భాష్య శ్రీ మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆడియెన్స్ అలా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఫీల్ అయ్యారు.  ఈ చిత్రానికి నేను మాటలు, పాటలు రాశాను. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి థాంక్స్’ అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా