Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Advertiesment
Harshali Malhotra

దేవీ

, బుధవారం, 2 జులై 2025 (16:44 IST)
Harshali Malhotra
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో షూటింగ్ పార్ట్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జార్జియాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయి హైదరాబాద్ చేరుకుంది టీమ్.
 
ఇందులో ఓ కీలక పాత్రను హర్షాలి మల్హోత్రా పోషించింది. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రాను  అఖండ2 నుండి 'జననీ'గా పరిచయం చేస్తున్నామని చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. ఇందులో ఆమె పాత్ర కీలకమైందని తెలియజేశారు. దసరా సెప్టెంబర్ 25న థియేటర్లలో అఖండ2 తాండవం  విడుదలకాబోతోంది. 
 
సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. S థమన్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం