Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుల్కర్ సల్మాన్ న‌టించిన సీతా రామం అప్‌డేట్‌

Dulquer Salman,  Mrinalini Thakur
, బుధవారం, 25 మే 2022 (17:49 IST)
Dulquer Salman, Mrinalini Thakur
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
 
ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న 'సీతా రామం' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.
మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ 'ఓ సీతా- హే రామా' పాటకు మంచి ఆదరణ లభించింది.  సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటిటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ  చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్బమ్ మరిన్ని అంచనాలు పెంచింది.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అడిషనల్ సినిమాటోగ్రఫీని శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం: హను రాఘవపూడి, నిర్మాత: అశ్వినీదత్, బ్యానర్: స్వప్న సినిమా, సమర్పణ: వైజయంతీ మూవీస్, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేజ‌ర్ చిత్రం అంద‌రినీ ఎమోష‌న్స్‌తో క‌ట్టి ప‌డేస్తుంది - శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌