Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చార్మికి ఆ విషయంలో షాక్... సిట్‌కు ఈ విషయంలో షాక్... హైకోర్టు

డ్రగ్స్ కేసులో రేపు సిట్ ముందు విచారణకు చార్మి హాజరు కావాల్సి వుంది. కాగా ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సిట్ హక్కులను కాలరాస్తుందని పిటీషన్లో పేర్కొన్న చార్మి బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా

చార్మికి ఆ విషయంలో షాక్... సిట్‌కు ఈ విషయంలో షాక్... హైకోర్టు
, మంగళవారం, 25 జులై 2017 (15:24 IST)
డ్రగ్స్ కేసులో రేపు సిట్ ముందు విచారణకు చార్మి హాజరు కావాల్సి వుంది. కాగా ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సిట్ హక్కులను కాలరాస్తుందని పిటీషన్లో పేర్కొన్న చార్మి బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా పిటీషన్లో సుదీర్ఘంగా ఎన్నో విషయాలను జోడించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును వెలువరించింది.
 
చార్మిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మహిళా అధికారుల సమక్షంలోనే విచారించాలని సూచించింది. ఒకవేళ విచారణ సమయం చాలకపోతే మరుసటి రోజు కానీ లేదంటే మరో రోజు కానీ మళ్లీ విచారణ చేయవచ్చని తెలిపింది. అలాగే చార్మి కోరుకున్నచోట విచారణ చేయాలని ఆదేశించింది. ఆమె అనుమతి లేకుండా రక్త నమూనాలను బలవంతంగా తీసుకోవద్దని తెలిపింది. 
 
ఈ విషయాలు ఓ రకంగా సిట్ అధికారులకు షాకిచ్చేవే అయినప్పటికీ వారు కూడా ఇలాగే తమ విచారణ వుంటుందనీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ చేస్తామని కూడా చెప్పారు. ఇకపోతే చార్మి చేసిన మరో అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తను నియమించుకున్న న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. 
 
ఇది డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన కీలకమైన కేసు అనీ, విచారణ సమయంలో కీలక సమాచారం వెలికి రావచ్చనీ, ఆ సమాచారం ప్రైవేటు న్యాయవాదికి చేరితే పక్కదోవ పట్టే అవకాశం వుందని ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించింది. కనుక చార్మి తరపు న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్...? బాలయ్య కెరీర్‌లోనే?