Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాటకం అమ్మలాంటింది, నేను నాటకాల్లో వారికి వేషాలు ఇస్తాను : డైరెక్టర్ అనిల్ రావిపూడి

Director Anil Ravipudi

డీవీ

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (09:45 IST)
Director Anil Ravipudi
నాటకాల నుంచి సినిమా పుట్టింది. కానీ ఇప్పుడు చాలామంది సినిమాల్లో రావడానికి సరైన మార్గం దొరకడంలేదు. ఇక సోషల్ మీడియా యుగంలో నాటకాలు వున్నాయా? అని చాలామందికి అనుమానం వస్తుంటుంది. నాటకం అమ్మలాంటిది. అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. 
 
రాత్రి జరిగిన ఉత్సవం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది. నాటకరంగం, రంగస్థలం బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్ కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మలాంటింది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది. 
 
ఈ సోషల్ మీడియా జనరేషన్ లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నేను, రఘుబాబు అన్నయ్య చాలా నాటకపోటీలకు విశిష్ట అతిధులుగా వెళ్లి టీమ్స్ కి బ్లెస్ చేసి, బహుమతులు ఇస్తుంటాం. నాటకరంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపధ్యంగా ఎంచుకొని 'ఉత్సవం' సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. దర్శక నిర్మాతలకు నా స్పెషల్ విషెస్. దిలీప్ కి ఇది ఫస్ట్ ఫిల్మ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెజీనా మంచి రోల్స్ చేస్తుంటారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. 
 
బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన్ని ఇంకా మంచి మంచి పాత్రల్లో మనం ఉపయోగించుకోవాలి. రాజేంద్రప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఇందులో వుండే దాదాపు అందరి నటులతో వర్క్ చేశాను. టీంలో అందరికీ నా బెస్ట్ విషెస్. ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుంటున్నాను' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్రుష్టం నావైపు వుందేమోనని అనుకుంటున్నా : యాంకర్ వింధ్య విశాఖ