బాలీవుడ్‌లో ఒక టైంలో కుర్రాళ్ళను ఉర్రూతలూరించిన నటి నీనా గుప్తా. ధర్మేంద్ర, అమితాబ్ సినిమాలు పీక్ స్టేజీలో వుండగా ఆమె గ్లామర్ రోల్స్ కూడా పోషించింది. సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత కూడా. కమర్షియల్, ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది.
ఆమెలో మరో కోణం కూడా వుంది. ఈమె 1980లలో ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్‌తో సహజీవనం చేసింది. ఆమెకు మసాబ గుప్తా అనే కుమార్తె కూడా వుంది. తాజాగా ఇప్పుడు వస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా మహిళలు దుస్తులు ధరిండచంపై నేడు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది.
తన లాగే సెక్సీగా చెస్ట్ కనిపించేలా ఎవరైనా సరే దుస్తులు ధరిస్తే బేకార్‌గా వుందని కామెంట్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్పదలిచాను. నేను సాన్స్‌స్క్రిట్‌లో ఎం.ఫిల్ చేశాను. అలాంటి దుస్తులు ధరించిన వారిని వెంటనే జడ్జి చేయకండి. అలాంటివారందరికీ నేను ఇదే చెప్పదలిచానంటూ పోస్ట్ చేసింది.