Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీరసింహారెడ్డి విజ్రుంభించబోతున్నాడు : దర్శకుడు గోపీచంద్ మలినేని

gopichand
, శనివారం, 7 జనవరి 2023 (14:53 IST)
జనవరి 12వ తేదీ నుంచి వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు అని ఆ చిత్రం చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నాడు. ఆయన మాట్లాడుతూ, 1999లో ఇదే ఒంగోలులో సమరసింహా రెడ్డి సినిమా చూడటానికి ఒక అభిమానిలా వెళ్ళా. అక్కడ చిన్న గొడవ జరిగితే రెండు పీకి తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సంక్రాంతికి సినిమా ఫస్ట్ షో మిస్ అయిపోయానని చాలా బాధపడ్డ. నైట్ షో చూసి ఇంటికి వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా పడుకున్నా. ఆలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్.. ఈ రోజు బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేసాడంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలి. 
 
ఒక మాస్ గాడ్‌ని  డైరెక్ట్ చేసే అవకాశం అందరికీ రాదు. బాలకృష్ణ గారిది బంగారు మనసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక కంటితో దర్శకుడిగా మరో కంటితో అభిమానిగా ఆయన్ని చూశాను. ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన్ని ప్రజంట్ చేయాలని ప్రతి క్షణం అలోచించాను. ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేను. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబుని నేను ఎంతఇష్టపడతానో వాళ్ళు అంతే ఇష్టపడతారు. సినిమా అంటే వాళ్ళకి జీవితం. నాకు బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. 
 
శ్రుతి హాసన్ అద్భుతమైన నటి. తనతో ఇది మూడో సినిమా. నాకు లక్కీ హీరోయిన్. డ్యాన్స్ కామెడీ ఇరగదీస్తుంది. హనీ రోజ మరో ముఖ్యమైన పాత్ర చేసింది. అద్భుతంగా చేసింది. దునియా విజయ్ ఇరగదీశారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ బానుమతిగా కనిపిస్తుంది. బాలయ్య బాబుని డీకొట్టే పాత్ర. అజయ్ ఘోస్, చంద్రరవి, సప్తగిరి అందరూ చాలా చక్కగా చేశారు. సాయి మాధవ్ బుర్రాగారు ఎక్స్ ట్రార్దినరీ డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్, తమన్ , డీవోపీ రుషి పంజాబీ, అర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ గారు.. ఇలా మా టెక్నికల్ టీం అంతా నాలుగు గోడల్లా నిలబడ్డారు. 
 
వీళ్ళంతా బాలయ్య బాబు అభిమానులే. ఫ్యాన్స్ అంతా కలిసి చేసిన సినిమా ఇది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కుమ్మికుమ్మి వదిలేశాడు. సోల్ పెట్టి చేశాడు. బాలయ్య బాబు .. ఐ లవ్ యూ. ఇది ఒక అభిమాని ప్రేమ. బాలయ్య బాబు అంత మంచి మనిషిని చూడలేదు. స్వచ్చమైన మనసు. ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన మామూలు మనిషి కాదు.
 
ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతున్నపుడు షూట్ లో సడన్ గా కిందపడ్డారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఒక్క సెకన్ లో లేచి రెడీ అన్నారు. షాక్ తిన్న. ఆయన డెడికేషన్ చూస్తే .. ఇదీ కదా మనికి కావాల్సిన హీరో అనిపించింది. ఇందుకే ఆయన మాస్ గాడ్ అయ్యారు. జనవరి 12 వీరసింహా రెడ్డి విజ్రుంభించబోతున్నాడు. అది మీరు చూడబోతున్నారు’’ అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరసింహారెడ్డి ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ : దర్శకుడు బి.గోపాల్