Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వీరసింహారెడ్డి' ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది: ప్రీరిలీజ్‌లో బాలకృష్ణ

Advertiesment
Balakrishna
, శనివారం, 7 జనవరి 2023 (08:41 IST)
Balakrishna
-జనవరి 12 వీరసింహారెడ్డి విజ్రుంభించబోతున్నాడు : దర్శకుడు గోపీచంద్ మలినేని
 
-వీరసింహారెడ్డి అభిమానులు అంచనాలని మించి వుంటుంది: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు
 
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. 
 
అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్  హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. 
 
ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ లో ఒంగోలులో మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చేతుల మీదగా విడుదలైన 'వీరసింహారెడ్డి' ట్రైలర్ ప్రేక్షకులు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
 
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 
 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యుడు దర్శకుడు బి గోపాల్ గారికి కృతజ్ఞతలు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు ఇలా చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారాయన. ఈ వేడుకకు బి గోపాల్ గారు ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది అభిమానులని పొందానంటే అది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నటీనటుల నుండి ప్రతి టెక్నిషియన్ నుండి టాలెంట్ ని తీసుకునే సత్తా వున్న ఒంగోలు గిత్త మలినేని గోపిచంద్. సినిమా మాధ్యమం ద్వారా సమరవీరుడిని నేను. 
 
మానవరణ్యంలో కల్మషం కుతంత్రాలని వేటాడే సింహరాజుని సింహాని నేనే. అలాగే ఒక హుందాతనంతో రోషానికి పౌరుషానికి ప్రతీకనైన రెడ్డిని నేనే .. నాయుడిని నేనే. (నవ్వుతూ) ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న అనంతరమైన అభిమానానికి నేను అపూర్వంగా అనురాగంగా పరిచే మనసు మీ బాలకృష్ణది. ఎన్నో రకాల సినిమాలు చేశాను. ఇంకా కసి తీరలేదు. ‘అఖండ’కు మించిన విజయాన్ని అందుకోవాలి దాని చేరుకోవాలనేది ఒక బరువు అనుకోలేదు. 
 
ఇప్పుడు వీరసింహా రెడ్డిని తీశాం. ఇది ఒక ఎపిక్. ‘సీమ‌లో ఏ ఒక్కడూ క‌త్తి ప‌ట్టకూడ‌ద‌ని నేనొక్కడినే క‌త్తి ప‌ట్టా’ అనే డైలాగ్ ఇందులో వుంది. దిని వెనుక పెద్ద కథ వుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, అఖండ ఎలాగో వీరసింహా రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. శ్రుతి హాసన్ కమల్ హాసన్ గారికి తగ్గ తనయ. అందంగా కన్నుల విందుగా అద్భుతంగా నటించింది. హనీ రోజ్ పాత్ర గురించి ఇప్పుడు చెప్పకూడదు. 
 
చాలా అద్భుతమైన పాత్ర. సినిమా చూశాక అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. దునియా విజయ్ చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే అజయ్ ఘోష్, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, వెంకట్ మాస్టర్ చాలా అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. రిరికార్డింగ్ లో సౌండ్ బాక్సులు బద్దలౌతాయి.
 
బుర్రసాయి మాధవ్ గారు పదునైన డైలాగ్స్ అందించారు. మా నిర్మాతలు రవి గారు నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. టర్కీలో కూడా షూట్ చేశాం. సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. వీరసింహా రెడ్డి ఒక విస్ఫోటనం. బాగా ఆడుతుందని చెప్పను.. బాగా ఆడి తీరుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
గోపీచంద్ మలినేని దర్శకుడు మాట్లాడుతూ.. 1999లో ఇదే ఒంగోలులో సమరసింహా రెడ్డి సినిమా చూడటానికి ఒక అభిమానిలా వెళ్ళా. అక్కడ చిన్న గొడవ జరిగితే రెండు పీకి తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సంక్రాంతికి సినిమా ఫస్ట్ షో మిస్ అయిపోయానని చాలా బాధపడ్డ. నైట్ షో చూసి ఇంటికి వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా పడుకున్నా. ఆలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్.. ఈ రోజు బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేసాడంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలి. ఒక మాస్ గాడ్ ని  డైరెక్ట్ చేసే అవకాశం అందరికీ రాదు. బాలకృష్ణ గారిది బంగారు మనసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక కంటితో దర్శకుడిగా మరో కంటితో అభిమానిగా ఆయన్ని చూశాను. 
 
ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన్ని ప్రజంట్ చేయాలని ప్రతి క్షణం అలోచించాను. ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేను. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబుని నేను ఎంతఇష్టపడతానో వాళ్ళు అంతే ఇష్టపడతారు. సినిమా అంటే వాళ్ళకి జీవితం. నాకు బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. శ్రుతి హాసన్ అద్భుతమైన నటి. తనతో ఇది మూడో సినిమా. నాకు లక్కీ హీరోయిన్. డ్యాన్స్ కామెడీ ఇరగదీస్తుంది. హనీ రోజ మరో ముఖ్యమైన పాత్ర చేసింది. అద్భుతంగా చేసింది.
 
దునియా విజయ్ ఇరగదీశారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ బానుమతిగా కనిపిస్తుంది. బాలయ్య బాబుని డీకొట్టే పాత్ర. అజయ్ ఘోస్ , చంద్రరవి, సప్తగిరి అందరూ చాలా చక్కగా చేశారు. సాయి మాధవ్ బుర్రాగారు ఎక్స్ ట్రార్దినరీ డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్, తమన్ , డీవోపీ రుషి పంజాబీ, అర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ గారు.. ఇలా మా టెక్నికల్ టీం అంతా నాలుగు గోడల్లా నిలబడ్డారు. వీళ్ళంతా బాలయ్య బాబు అభిమానులే. ఫ్యాన్స్ అంతా కలిసి చేసిన సినిమా ఇది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కుమ్మికుమ్మి వదిలేశాడు. 
 
సోల్ పెట్టి చేశాడు. బాలయ్య బాబు .. ఐ లవ్ యూ. ఇది ఒక అభిమాని ప్రేమ. బాలయ్య బాబు అంత మంచి మనిషిని చూడలేదు. స్వచ్చమైన మనసు. ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన మామూలు మనిషి కాదు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతున్నపుడు షూట్ లో సడన్ గా కిందపడ్డారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఒక్క సెకన్ లో లేచి రెడీ అన్నారు. షాక్ తిన్న. ఆయన డెడికేషన్ చూస్తే .. ఇదీ కదా మనికి కావాల్సిన హీరో అనిపించింది. ఇందుకే ఆయన మాస్ గాడ్ అయ్యారు. జనవరి 12 వీరసింహా రెడ్డి విజ్రుంభించబోతున్నాడు. అది మీరు చూడబోతున్నారు’’ అన్నారు.
 
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ కి బిగ్ థాంక్స్. వారితో ఇది నాకు మూడో సినిమా. వీరసింహారెడ్డి కి పని చేసినం నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు గోపీచంద్ గారితో ఇది నా మూడో సినిమా.  పరిశ్రమలకో నాకు అన్నయ లాంటి వ్యక్తితను. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  బాలయ్య గారు రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్. జై బాలయ్య’’ అన్నారు.
 
వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి అద్భుతమైన సినిమా చేసుకునే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. శ్రుతిహాసన్ గారు ఇందులో ఇరగదీశారు. అలాగే హానీ రోజ్, దునియా రవి, చంద్రక రవి అద్భుతంగా పెర్ ఫార్మ్ చేశారు. మా దర్శకుడు గోపీచంద్ మలినేని గారు సినిమాని ఇరగదీశారు. 
 
రామ్ లక్ష్మణ్ మాస్టర్ చింపి ఆరేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ గారు, ఎడిటర్ నవీన్ నూలి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఇరగగొట్టాడు.రీరికార్డింగ్ వేరే లెవల్ లో వుంది. నందమూరి అభిమానుల అంచనాలు మించేలా వీరసింహారెడ్డి వుంటుంది. రెండు సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు
 
నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో సినిమా చేయడం మా కల. వీరసింహారెడ్డి తో ఆ కల తీరినట్లయింది.  ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. మాకు ఇంత గొప్ప సినిమా తీసి పెట్టిన గోపిచంద్ మలినేని గారికి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరినీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన బి గోపాల్, అంబికా కృష్ణ గారికి కృతజ్ఞతలు. జనవరి 12న వీరసింహ రెడ్డి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.
 
బి గోపాల్ మాట్లాడుతూ...  వీరసింహారెడ్డి ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ. అద్భుతంగా వుంది. బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం. బాలయ్య బాబు అద్భుతమైన నటుడు. నాకు నాలుగు సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టారు బాలయ్య. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు.. అన్నీ సూపర్ హిట్లే. 
 
వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు లక్స్, గెటప్ చూస్తుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. పండగకి వీరసింహారెడ్డి పెద్ద అలంకారం. సమరసింహా రెడ్డి, నరసింహనాయడు, అఖండలకి మించి వీరసింహారెడ్డి విజయం సాధించాలి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య బాబుని అద్భుతంగా చూపించాడు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ గొప్పగా నిర్మించారు. ఇందులో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నటసింహం వీర సింహమై గర్జిస్తే ఎలా వుంటుందో   వీరసింహారెడ్డి సినిమా అలా వుంటుంది. ప్రపంచంలోని బాలకృష్ణ అభిమానాలంతా మీసం తిప్పి కాలర్ ఎగరేసుకునేలా వుంటుంది. ఇందులో అనుమానం లేదు. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ వుంటాయి. బాలయ్య బాబు అభిమానులు పండగ చేసుకునేలా వుంటుంది. 
 
వీరసింహారెడ్డి లో నేను ఒక భాగం అని చెప్పుకోవడం గర్వంగా వుంది. కమల్ హాసన్ గారిలో వుండే కామెడీ టైమింగ్ శ్రుతి హాసన్ గారిలో వుంది. వీరసింహారెడ్డి లో ప్రేక్షకులు అది ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ రామారావు గారి డీఎన్ఎ కమల్ హసన్ గారి డీఎన్ఎ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎంత అద్భుతంగా వుంటుందో వీరసింహారెడ్డిలో చూస్తారు. 
 
గోపీచంద్ మలినేని ఈ సినిమా కి మాటలు రాసే అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మైత్రీ మూవీ మేరక్స్ అద్భుతమైన నిర్మాతలు. వారికి సినిమా అంటే ఒక బంధం. వీరసింహా రెడ్డి సంచలన విజయ సృష్టించింది. ఇందులో అనుమానం లేదు’’ అన్నారు.
 
హనీ రోజ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా లు చేయాలని నా కోరిక. ఆ కోరిక వీరసింహా రెడ్డితో తీరింది. ఈ గొప్ప అవకాశం కల్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారితో కలసి నటించడం నా అదృష్టం. మా నిర్మాతలకు, మిగతా టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు
 
దునియా విజయ్ మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి వీరసింహుడు శాంతి స్వరూపంగా ఉగ్రరూపంగా థియేటర్స్ కి వస్తున్నాడు. మీకు శాంతి కావాలంటే శాంతిగా ఉంటాడు ఉగ్రం కావాలంటే ఉగ్రరూపం చూపిస్తాడు. వీరసింహారెడ్డి ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మీ అందరిలానే నేను థియేటర్ లో చూడాలని ఎదురుచూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ తెలిపారు,
 
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. బాలయ్య బాబు నిలబడితే హీరోయిజం, నడిస్తే హీరోయిజం, కూర్చుంటే హీరోయిజం, మాట్లాడితే హీరోయిజం. ఏ కోణంలో చూసిన బాలయ్య బాబు అద్భుతం.  వీరసింహా రెడ్డి ప్రేక్షకులకు, అభిమానులు పండగలా వుంటుంది. బాలయ్య బాబు అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు చేశారు. 
 
చైర్ లో కూర్చుని ఒక ఫైట్ చేస్తారు. ప్రేక్షకులు చాలా ఎంజట్ చేస్తారు. బాలయ్య బాబు గారిని దర్శకుడు గోపిచంద్ మలినేని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో గోపిచంద్ గారు ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతారు. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. అభిమానులు అంచనాలు తగ్గట్టు వీరసింహారెడ్డి’’ తెలిపారు.
 
వెంకట్ మాస్టర్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో పని చేయడం నా అదృష్టం. ఇందులో బాలయ్య గారు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో కాళ్ళకి చెప్పులు లేకుండా మండుటెండలో వారం రోజులు ఫైట్ చేశారు. ఆయన డెడికేషన్ కి మైండ్ బ్లాంక్ అయిపొయింది. బాలకృష్ణ గారు అందరికీ స్ఫూర్తి. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.    
 
అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. మహాపురుషుడు నందమూరి తారకరామారావు గారి అంశ బాలకృష్ణ గారు. ఆయనతో కలసి పని చేయడంతో నా జన్మధన్యమైయింది. ఈ జన్మకి ఇది చాలు. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
సప్తగిరి మాట్లాడుతూ..  సమరసింహం, నరసింహం, సింహ, లెజెండ్ .. ఈ ఐదుగురికి క్రాక్ ఎక్కితే ఒకరు బయటికి వస్తారు. వారే వీరసింహం. ఆ క్రాక్ ఎక్కిన సింహం ఎలా వుంటుందో 12న చూస్తారు. బాలకృష్ణ గారితో పని చేయడం నా అదృష్టం. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య ఇరగదీశారుగా... (video)