Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవిశ్రీ ప్రసాద్ సంచలన నిర్ణయం.. ఇక చిన్న సినిమాల పరిస్థితి!

Advertiesment
Devi Sri Prasad
, బుధవారం, 29 మే 2019 (18:53 IST)
టాలీవుడ్ సంగీత ప్రపంచంలోకి యువ కెరటంలా దూసుకొచ్చి అనేక విజయాలను స్వంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటికీ కూడా టాలీవుడ్‌లో చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఏ మాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉంటూ తనదైన శైలిలో సంగీతాన్ని అందిస్తూ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నారు.


దేవి మ్యూజిక్ అందించిన సినిమాలలో చాలావరకు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయే తప్ప డిసాస్టర్‌గా మిగిలిన సందర్భాలు లేవనే చెప్పాలి. స్టేజీ షోలలో సైతం మంచి ఎనర్జీతో పెర్ఫామ్ చేసే ఈ యువ సంగీత దర్శకుడికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సంగీత ప్రియులకు నిరాశే మిగల్చనుందనే వార్త జోరుగా ప్రచారమవుతోంది.
 
గత కొన్నేళ్లుగా ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ఆశించినంత హిట్ సాధించలేకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవి మ్యూజిక్‌లో ఎప్పుడూ ఉండే మ్యాజిక్ ఇప్పడు లేదని, అన్నీ ఒకేలా ఉంటున్నాయని ప్రేక్షకులలో ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ఇటీవల వచ్చిన రామ్ చరణ్ సినిమా "వినయ విధేయ రామ" మరియు మహేష్ బాబు యొక్క "మహర్షి" సినిమాలలోని సంగీతం బలం చేకూరుస్తోంది.
 
ఇక ఇంటర్నెట్‌లో దేవీ శ్రీపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇది గమనించిన దేవీ పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశ్యంతో .. ఇక వరుస సినిమాలు ఒప్పుకోకూడని నిర్ణయించుకున్నారట, వరుస సినిమాలు చేయడం వలనే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని భావించిన ఆయన ఇక పెద్ద సినిమాలకు మాత్రమే సంగీతం అందించాలని భావిస్తున్నారంట.

చిన్న సినిమాల వారికి ఇది కాస్త నిరాశ కలిగించినప్పటికీ అభిమానులకు ఇది శుభవార్తే అవుతుందేమో! బిజీ షెడ్యూల్‌లలోనే ఇంత మంచి సంగీతం అందిస్తే, ఇక తీరిగ్గా అందిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా మేనల్లుడి మరో ప్రాజెక్ట్... కథ విన్న చిరంజీవి ఏమన్నారంటే..?