ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. 'చుట్టమల్లే' అంటూ సాగే మెలోడీ సాంగ్ దేవర నుంచి వచ్చేసింది. ఈ చిత్రం మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ మెలోడీ శ్రోతలను తప్పకుండా ఆకట్టుకుంటుంది. శిల్పారావు గాత్రం గమత్తుగా అనిపిస్తోంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. అనిరుధ్ రవిచందర్ తన బాణీలతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. మెలోడియస్ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు.
ఇక ఈ సాంగ్ తాలూకు లిరికల్ వీడియో కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. తారక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. జాన్వీ కూడా ఎప్పటిలానే అంతే అందంగా కనిపించింది.