Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక చరిత్ర కుప్పకూలిపోయింది.. ఎన్నో సినిమాలను నిలబెట్టిన చెట్టు ఒరిగిపోయింది.. (Video)

big tree

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (16:52 IST)
ఒక చరిత్ర కుప్పకూలిపోయింది. ఎన్నో సినిమాలను నిలబెట్టిన ఆ మహావృక్షం సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఎన్నో సినిమాల్లో కనిపించి సినిమా చెట్టుగా పేరు గాంచిన చెట్టు సోమవారం తెల్లవారుజామున నేలకూలింది. దీని వయసు 150 ఏళ్లు పైనే ఉంటాయి. 
 
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టున ఉండే ఈ వృక్షరాజం నీడన ఎన్నో దశాబ్దాలుగా చాలా సినిమాల షూటింగులు జరిగాయి. వంశీ, కె.రాఘవేంద్రరావు వంటి ఎందరో దర్శకులకు ఈ చెట్టు ఓ సెంటిమెంట్‌గా ఉండేది. తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో ఈ చెట్టు కనిపించాలని ప్లాన్ చేసేవారు. అలా ఈ చెట్టుకు సినిమా చెట్టుగా పేరు వచ్చింది. 
 
ఆ చెట్టు కింద సినిమా షూట్ చేస్తే సూపర్ హిట్టే. అందుకే అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు కూడా ఇక్కడికి వచ్చేవారు. 1974లో వచ్చిన "పాడిపంటలు" చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం.. "సీతారామయ్య గారి మనవరాలు"లో సమయానికి...,
"గోదావరి" చిత్రంలో ఉప్పొంగేలే గోదావరి లాంటి వందలాది పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అందుకే దీనిని సినిమా చెట్టు అని పిలుస్తారు.
 
గోదావరి వరద ఉధృతికి దెబ్బతినకుండా ఈ చెట్టు చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు అధికారులను కోరారు. అయితే ఈరోజు హఠాత్తుగా ఈ చెట్టు నేలకూలింది. ఈ చెట్టు గురించి తెలిసిన గోదావరి వాసులు సోషల్ మీడియాలో సినిమా చెట్టుతో తమకున్న అనుభవాలను, కూలిపోవటంపై అవేదనను వ్యక్తం చేస్తున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్ప లో ఎరుకల తెగకు నాయకుడిగా దేవరాజ్ లుక్