'దేవర' కోసం జపనీస్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు. త్వరలో జపాన్ ప్రయాణం చేయనున్నారు ఎన్.టి.అర్. ఈ విషయాన్ని నేడు ఎన్.టి.అర్. టీం ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇస్తున్న ఫోటో విడుదల చేసింది. ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్. సినిమా కోసం ఇకసారి వెళ్లి వచ్చారు. బాహుబలి టైములో ప్రభాస్ కూడా అక్కడకు వెళ్లి ప్రచారం చేసారు. మార్చి 28న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.
భారత్ లో 'దేవర' భారీ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ బరిలో ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పు డు జపాన్ వెళ్లేందుకు ఆయన సిద్దమైనారు. మార్చి 22న జపాన్ వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ కార్యక్రమాల వల్ల ప్రస్తుతం ఎన్.టి.అర్ నటిస్తున్న సినిమా చిత్రీకరణలకు కాస్త విరామం ఇవ్వనున్నారు.
పూర్తి యాక్షన్ సినిమా గా కొరటాల శివ దేవర సినిమా తీసారు. మొదట్లో మోస్తరుగా ఉన్న సినిమా క్రమేపి పుంజుకుంది. కోరటాలకు, ఎన్.టి.అర్ కు హిట్ సినిమాగా నిలిచింది. తెలుగులోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పించింది. అందుకే జపాన్ ప్రజల ముందుకు తీసుకు వెళ్తున్నారు. సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ తదితరులు నటించారు.