బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె మరోసారి ఆసుపత్రిలో జాయిన్ అయింది. దీపికా పదుకొణె సోమవారం రాత్రి అసౌకర్యానికి గురై వెంటనే ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారంనాడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడంతో ఆమె ముంబైలోని బ్రీజ్‌కాండీ ఆసుపత్రిలో చేరిందని ఆ తర్వాత ఒక్కరోజులేనే డిచార్జ్ అయిందని బాలీవుడ్ మీడియా తెలియజేసింది. చెన్నై ఎక్స్రె్ప్రెస్ తర్వాత షారూఖ్‌లో మరో సినిమా చేసింది. అది జనవరిలో విడుదలైంది.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె. సినిమా షూటింగ్ సమయంలోనూ జూన్‌నెలాఖరున ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఫిలింసిటీలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో షడెన్‌గా కూలబడిపోయింది. వెంటనే ఆమెను దగ్గరున్న ఆసుపత్రికి చేర్చారు. ఈ విషయమై చిత్ర నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ, ఆమె బి.పి. సమస్యతో బాధపడుతుంది. అంతకుమించి ఏమీ లేదని అన్నారు. కానీ ఆయన మాటలు ఎవరూ విస్మరించలేదు. ఎందుకంటే తనకు మానసిక రుగ్మత వుందని గతంలోనే దీపికా ప్రకటించింది.
ఈ మానసిక ఆందోళన, టెన్షన్ గురించి పలు విధాలుగా దీపిక ట్రీట్ మెంట్ చేసుకుంటుంది. ఏదో తెలీని భయం, ఆందోళన, ఒంటరి అయిపోతున్నాననే ఫీలింగ్ తనకు అప్పుడప్పుడు కలుగుతుందని బాలీవుడ్ నాయిక దీపిక చెప్పడం విశేషం.