Naga Chaitanya, Kriti Shetty
అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు ప్రోమోలు మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ సినిమా కథాంశంపై క్యురియాసిటీని పెంచుతోంది. హీరో, విలన్ ని రక్షించడం, అతనిని చనిపోనివ్వకుండా చేయడం కథాంశం యూనిక్ గా, ఉత్కంఠభరితంగా వుంది. నాగ చైతన్య చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్‌గా కనిపించారు. అతని ప్రేమ సమస్యలో ఉంది. ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయిస్తున్నారు. ఒక నేరస్థుడిని కోర్టు ముందు హాజరుపరిచే వరకు తన ప్రత్యర్థుల నుండి కాపాడవలసి భాద్యత హీరోపై వుంది.
సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఇది అతనికి టైలర్ మేడ్ క్యారెక్టర్. చైతన్య కన్విన్సింగ్‌గా కనిపించారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు
థ్రిల్లర్‌ల విషయంలో వెంకట్ ప్రభు మాస్టర్. కస్టడీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతంగా వుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.
ఎస్ఆర్ కతీర్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్. వెంకట్ రాజన్ ఎడిటింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
మే 12న విడుదల కానున్న ఈ చిత్రానికి రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్.