Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కస్టడీలో హీరో విలన్ ని కాపాడతాడని చెప్పగానే షాక్ అయ్యా : కృతి శెట్టి

nagachitnya, Kriti Shetty and others
, గురువారం, 4 మే 2023 (14:00 IST)
nagachitnya, Kriti Shetty and others
అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ కి ట్రెమండస్ వచ్చింది. ‘కస్టడీ’ మే 12న థియేటర్లలో రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ యూనిట్ నిర్వహించింది.  
 
నాగచైతన్య మాట్లాడుతూ.. కస్టడీ మే 12న విడుదలౌతుంది. టీజర్ కి తెలుగు, తమిళ్ ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మే 5న విడుదలౌతుంది. ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం చేతిలో వుంటే తను ఎంత దూరం వెళ్తాడనే పాయింట్ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ కథకు నేను ఎందుకు అని అడిగినపుడు.. లవ్ స్టొరీలో నా నటన నచ్చిందని, ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని చెప్పారు. నాకు ఎప్పటి నుంచో తమిళ్ లో సినిమా చేయాలనే ఉండేది. వెంకట్ ప్రభు గారితో అక్కడ లాంచ్ కావడం, ఆయన ఇక్కడకి పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. వెంకట్ ప్రభుగారికి అద్భుతమైన స్క్రీన్ ప్లే టెక్నిక్ వుంటుంది. కథ విన్నప్పుడు ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలతో పని చేయడం నా కల నెరవేరినట్లయింది. ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. కస్టడీ లో చాలా లేయర్లు వున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక లేయర్ రివిల్ అవుతూ వుంటుంది. కృతితో రెండో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మే 12న సినిమా మీ ముందుకు వస్తోంది. మీ అందరి రియాక్షన్ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు.
 
కృతి శెట్టి మాట్లాడుతూ.. ఈ కథని వెంకట్ ప్రభు గారు చాలా సింపుల్ గా చెప్పారు. హీరో విలన్ ని కాపాడతాడని అన్నారు. మొదట షాక్ అయ్యా. అంతే స్క్రీన్ ప్లే ఇంత సింపుల్ గా ఉండదు. చాలా ఇంటెల్ జెంట్ స్క్రీన్ ప్లే. ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతారు. నాగచైతన్య గారితో ఇది రెండో సినిమా. ఆయనతో వర్క్ చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. మా కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. వెంకట్ ప్రభ గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు'' తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దూకుడు మీదున్న పవన్ కళ్యాణ్ - రెండు చిత్రాల అప్‌డేట్స్ వెల్లడి