Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఎదురీత' సెన్సార్ పూర్తి

Advertiesment
'ఎదురీత' సెన్సార్ పూర్తి
, బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:11 IST)
Sravan Raghavendra, Leona Lishoy
'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించారు. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో లియోనా లిషోయ్ హీరోయిన్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత బోగారి ఈశ్వర్ చరణ్ మాట్లాడుతూ "ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ప్ర్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది? అనేది సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా సినిమాలో భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. త్వరలో పాటలు విడుదల చేసి, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని చెప్పారు. 
 
సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, 'మాస్టర్' చరణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి 
 
ఛాయాగ్రహణం: విజయ్ ఆర్పుదరాజ్ (రత్నవేలు దగ్గర కుమారి21ఎఫ్, బ్రహ్మోత్సవం, లింగ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు),  పాటల రచయితలు: డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రిడా, విశ్వ, స్వామి, ఎడిటర్: నగూరన్ రామచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్: అరల్ కొరెల్లి  , పోస్టర్ డిజైన్: అనిల్ భాను, పీఆర్: నాయిడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), దర్శకుడు: బాలమురుగన్ (దర్శకుడు విజయ్ మిల్టన్ దగ్గర 'గోలి సోడా', 'కడుగు', తెలుగులో 'టెన్'గా విడుదలైన విక్రమ్, సమంత సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశారు), నిర్మాత : బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`పోకిరి`కి మ‌హేష్‌బాబు చేస్తే డౌట్ అన్న‌దెవ‌రు? పూరీ ఏం చేశాడు?