Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకే లేదా డీఎంకేల్లో ఏదైనా ఒక్క పార్టీలో చేరుతా: శ్రీరెడ్డి

Advertiesment
Cinema
, శనివారం, 1 జూన్ 2019 (11:26 IST)
ఆంధ్రా రాజకీయాల కంటే తమిళనాడు రాజకీయాల పట్ల ఆసక్తిగా వున్నానంటూ.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఓపెన్‌గా చెప్పిసింది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చేటప్పుడు.. తమిళనాడులో దిగువ తరగతి ప్రజల సంఖ్య అధికంగా వుందని.. వారికి చేయూతనిచ్చేందుకు.. ఇంకా వేసవిలో ముఖ్యంగా తాగునీటిని ఏర్పాటు చేసినట్లు శ్రీరెడ్డి వెల్లడించింది. అంతేగాకుండా ఏపీ కంటే తమిళనాడు రాజకీయాల్లో వుండాలని ఆశగా వుందని తన మనసులోని మాటను శ్రీరెడ్డి బయటపెట్టింది.  
 
సినీ అవకాశాలు అడగడానికి వెళ్తే.. పడక పంచుకోవాలని పలువురు తెలుగు దర్శకులు వేధించారని.. క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. కోలీవుడ్‌కు వచ్చిన కొత్తల్లో దర్శకుడు రాఘవ లారెన్స్, ఏఆర్ మురుగదాస్‌లపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఆపై కోలీవుడ్‌లో రాఘవ లారెన్స్ ఛాన్సిచ్చే సరికి మిన్నకుండిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమా అవకాశాలతో బిజీగా వుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో పాలుపంచుకోవాలనే తన ఆరాటాన్ని బయటపెట్టింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తనకు తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆమె ఉన్నంతకాలం అన్నాడీఎంకే తలెత్తుకుని బతికిందని.. డీఎంకే కూడా తమిళనాడులో పెద్ద పార్టీ అని తెలిపింది. 
 
అంతేగాకుండా.. అన్నాడీఎంకే లేదా డీఎంకే ఈ రెండు పార్టీల్లో ఏదేని ఒక్క పార్టీలోనైనా తప్పక చేరుతానని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైబ్రిడ్ పిల్లకు లక్కీ ఛాన్స్..?