మెగాస్టార్ చిరంజీవిన తన పుట్టిన రోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీ సోమవారం జరుపుకున్నారు. ఈ పుట్టినరోజున ఆయన హైదరాబాద్ నగరానికి దూరంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులందరితో గడిపిన క్షణాలను అద్భుతమన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న ఫోటోలను షేర్ చేశారు.
అలాగే, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసుని తాకిందని ఆయన చెప్పారు.