Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహన్ బాబుది రాక్షస ప్రేమ... మామూలుగా ఉండదు... కలెక్షన్ కింగుకు చిరు స్వర్ణ కంకణం

ఈ రోజు షూటింగ్ రద్దు చేయండి. లేదా అవతల ఓ రాక్షసుడిలాంటి వ్యక్తితో గొడవైపోద్ది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇంతకీ ఆయన ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

Advertiesment
Chiranjeevi
, ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (21:53 IST)
ఈ రోజు షూటింగ్ రద్దు చేయండి. లేదా అవతల ఓ రాక్షసుడిలాంటి వ్యక్తితో గొడవైపోద్ది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇంతకీ ఆయన ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
వైజాగ్‌లో టీఎస్ఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో చిత్రపరిశ్రమలో 40 యేళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో చిరంజీవి కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్‌బాబు తనకు ఫోన్ చేసి హాజరు కావాల్సిందిగా కోరినప్పుడు తాను వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. నిజానికి ఇదివరకు తన డేట్స్ తన వద్దే ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా చేస్తుండటం వలన ఈ రోజు షూటింగ్ ముందుగానే ప్లాన్ చేశారని చెప్పారు. 
 
అయితే ఆ షూటింగ్ రద్దు చేయాల్సిందిగా తాను కోరానని, లేదంటే అవతల ఒక రాక్షసుడిలాంటి వ్యక్తితో గొడవైపోతుందని చెప్పానని సరదాగా అన్నారు. మోహన్‌బాబు ప్రేమ రాక్షస ప్రేమ లాంటిదని అందులో అంతటి ప్రేమ, వాత్సల్యం ఉంటాయని చిరంజీవి అన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా విరగపడి నవ్వారు. మోహన్ బాబు సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దిగ్విజయంగా ముందుగు సాగడంపై చిరు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు చిరంజీవి స్వర్ణ కంకణం బహూకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్రినాకు స్మితా పాటిల్ అవార్డ్.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు..?