కత్రినాకు స్మితా పాటిల్ అవార్డ్.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు..?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్‌పై పడ్డాడు. కత్రినాకు స్మితా పాటిల్ స్మారక అవార్డ్ రావడంపై జరుగుతున్న చర్చకు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. అసలు స్మి
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్‌పై పడ్డాడు. కత్రినాకు స్మితా పాటిల్ స్మారక అవార్డ్ రావడంపై జరుగుతున్న చర్చకు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.
అసలు స్మితా పాటిల్‌తో కత్రినా ఎలా పోలుస్తామని.. ఆమె ఎవరో కూడా కత్రినా తెలియకపోవచ్చంటూ పలు కామెంట్లు వచ్చాయి. వాయిస్, యాక్టింగ్, డ్యాన్స్ సరిగ్గా రాకపోయినా కత్రినా అందరినీ షాక్ ఇచ్చారు.
98.5 శాతం మంది కత్రినాకు స్మితా పాటిల్ అవార్డ్ రావడంపై అసూయపడుతున్నారని, మిగిలిన 1.5 శాతం మంది వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకు కూడా తెలియదని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. అయితే కత్రినా తాను ఏమీ లేకపోయినప్పటికీ కష్టపడి అన్నీ సాధించుకుందని తెలిపాడు. అయితే వీటి నేపథ్యంలో వర్మ కత్రినాకు మద్దతుగా నిలిచారు. నిజానికి కత్రినాకు ఆ అవార్డ్ దక్కినందుకు స్మిత పాటిల్ తనకు గౌరవంగా భావిస్తారని చెప్పారు.