చంద్రబాబు రాకింగ్ సీఎం: జీవిత.. నంది అవార్డు వివరాలు...
నంది జ్యూరీ(2015 సంవత్సరం)కి నేతృత్వం వహించిన సినీనటి జీవిత మాట్లాడుతూ తనది విజయవాడేననీ ఇక్కడ నంది అవార్డులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబునాయుడు రాకింగ్ సీఎం
నంది జ్యూరీ(2015 సంవత్సరం)కి నేతృత్వం వహించిన సినీనటి జీవిత మాట్లాడుతూ తనది విజయవాడేననీ ఇక్కడ నంది అవార్డులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబునాయుడు రాకింగ్ సీఎం అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. తెదేపాలోకి వస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నిస్తే ‘మీరు రమ్మంటే వస్తాను’ అన్నారు.
నంది అవార్డుల ప్రకటన
2014 ఉత్తమ చిత్రం- లెజెండ్
2015 ఉత్తమ చిత్రం- బాహుబలి-1
2016 ఉత్తమ చిత్రం- పెళ్లి చూపులు
అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంది అవార్డులను ప్రకటించారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులకు సంబంధించిన వివరాలను జ్యూరీ సభ్యులు తెలిపారు.
2014 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం- లెజెండ్
ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్)
ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం
తృతీయ చిత్రం- హితుడు
ఉత్తమ ప్రతినాయకుడు- జగపతిబాబు (లెజెండ్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు- సాయి శ్రీరామ్ (అలా ఎలా)
ఉత్తమ నటి- అంజలి (గీతాంజలి)
కొరియోగ్రాఫర్- ప్రేమ్‌రక్షిత్
ఫైట్‌మాస్టర్-రామ్‌లక్ష్మణ్
ఉత్తమ సహాయ నటుడు- నాగచైతన్య (మనం)
సహాయనటి- మంచులక్ష్మి (చందమామ కథలు)
హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
బాలనటుడు- గౌతమ్ కృష్ణ(నేనొక్కడినే)
2015 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం- బాహుబలి-1
ఉత్తమ నటుడు- మహేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- మళ్లీ మళ్లీ రానిరోజు
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్-కంచె
ఉత్తమ బాలల చిత్రం-దానవీర శూరకర్ణ
ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్ (భలేభలే మగాడివోయ్)
ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రహ్మణ్యం
ఉత్తమసహాయ నటి- రమ్యకృష్ణ
ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి
స్పెషల్ జ్యూరీ అవార్డు- విజయ్ దేవర కొండ
ఉత్తమపాటల రచయిత- రామజోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)
2016 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
ఉత్తమ నటుడు- జూనియర్ ఎన్టీఆర్
ఉత్తమ దర్శకుడు- సతీశ్ వేగేశ్న (శతమానం భవతి)