Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

Chandini Choudhary  yevam look

డీవీ

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (18:00 IST)
Chandini Choudhary yevam look
కథానాయిక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యేవమ్‌'. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది.
 
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర 'ఆడపిల్లని అయితే ఏంటంటా? ' అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ రౌడీ కథగా విశాల్ రత్నం- రివ్యూ