Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ రౌడీ కథగా విశాల్ రత్నం- రివ్యూ

Vishal

డీవీ

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:46 IST)
నటీనటులు: విశాల్‌, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు, మురళీ శర్మ తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: టీ ఎస్ జయ్ద, ర్శకుడు: హరి, నిర్మాత: దేవీ శ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు: ఎం. సుకుమార్, ఎడిటింగ్: కార్తికేయన్ సంతానం
 
యాక్షన్ సినిమాలు తీసిన హరి దర్శకత్వంలో యాక్షన్ సినిమాలంటే ఇష్టమున్న హీరో విశాల్ కలిసి చేసిన చిత్రం రత్నం. పేరులోనే రత్నం లాంటి మనిషి అనే అర్థం వచ్చేలా పెట్టినా మంచికి మంచి చెడుకు చెడు చెండాలాడే వ్యక్తి కథ ఇది. పూర్తి యాక్షన్ పాళ్ళు ఎక్కువ వున్న ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ :
తమిళనాడు, ఆంధ్ర బోర్డర్ కుచెందిన రెండు ఊళ్ళకు చెందిన కథ ఇది. ఆంధ్రలో వుండగానే రత్నం (హీరో విశాల్) చిన్నతనంలోనే ఓ మహిళను చంపి రౌడీగా వున్న పన్నీర్ స్వామి (సముద్రఖని) ప్రాణాలు కాపాడతాడు. దాంతో అతనిదగ్గరే రత్నం వుంటాడు. ఎమ్మెల్యే గా ఎదిని పన్నీర్ స్వామి (సముద్రఖని) అనుచరుడిగా రత్నం మారతాడు. ఇక చెన్నైబోర్డర్ నుంచి అరాచకాలు, హింసలు చేస్తూ మురళీశర్మ అతని ఇద్దరు స్నేహితులు కేంద్ర మంత్రిని శాసించే స్థాయికి ఎదుగుతారు. వారు చేసిందే శాసనం. అలాంటి వ్యక్తుల నుంచి మల్లిక (ప్రియా భవానీ శంకర్)కు ప్రాణహాని వుందనిగ్రహించి ఆమెను కాపాడటానికి రత్నం ప్రాణాన్ని పణంగా పెడతాడు. అసలు మల్లిక ఎవరు? చెన్నై, ఆంద్ర బోర్డర్ కథేమిటి? అనేది సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా చూస్తున్నంతసేపు హింసకు కొదవేలేదు. కత్తిపోట్లు, నరకడాలు ఇంతదారుణంగా వుంటాయా? అనిపించేలా వుంటుంది. ఆడకూతురు బయటకు తిరగాలంటే భయం కలిగించేలా రౌడీ మూకలు, వారి నాయకులు ఎలా వుంటారో చూపించాడు. ఒక రకంగా ఆంధ్రలో ప్రస్తుతం జరిగే హింసకు పరాకాష్టగా అనిపిస్తుంది. తనకు నచ్చిన స్థలం కోసం ఎంతకైనా తెగించే కబ్జాదారులు, దౌర్జన్యాలు, దోపిడీలు దారుణంగా చేసే వారు పేరు మార్చుకుని వైట్ కాలర్ తో బతికే మురళీ శర్మ వంటివారు సమాజంలో చాలానే చూస్తున్నాం. అలాంటి వారిని ఎదిరించాలంటే అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న చందంగా హీరో పాత్ర వుంటుంది.
 
హీరోను అనాథ చూపించి ఆ తర్వాత హీరోయిన్ లో తన తల్లిని చూసుకునే పాయింట్ దర్శకుడు కొత్తగా ప్రయత్నించాడు. ఈ కోణంలో యాక్షన్ ఎపిసోడ్స్, కథనం అంతా సింగం ఫార్మెట్ లో వుంటుంది. సినిమా మొదట్లో బస్సులను దోపిడీ చేసి దారుణంగా ప్రయాణీకులను చంపడంవంటివి అఫ్రోశ్ వంటి బాలీవుడ్ టు మాలీవుడ్ కథలు చాలానే వచ్చాయి. ఇక రత్నంలో హింస మామూలుగా లేదు. ఆమద్య హింసకు పరాకాష్టగా సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమాకు మించినట్లుగా వుంది.  అందులో తుపాకులుంటే ఇందులో కత్తులు కటారులుంటాయి.
 
మురళీ శర్మ, సముద్రఖని నటన కూడా సహజంగా ఉంది. గౌతమ్ మీనన్, యోగి బాబు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఈ చిత్రంలోని మాస్ టేకింగ్ చిత్రమిది. ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో విశాల్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
 
విశాల్ గత చిత్రాల తాలూకూ కథ, కథనాలతోపాటు యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తాయి. మాటలు సందర్భానుసారంగా వున్నాయి. పాటలు అలానే వున్నాయి. సంగీతం సన్నివేశపరంగా కుదిరాయి.  సరికొత్తగా వుండే అంశాలు లేవు. మారుతున్న ట్రెండ్ కు తగినట్లు కథ లేదు. ఇలాంటి సినిమా ఈానాటి ట్రెండ్ ను ఏ మాత్రం మెప్పించదనే చెప్పాలి. తనను హీరో కాపాడిన తర్వాత హీరోయిన్ ఓ రౌడీ కథ అంటూ ఓ పుస్తకం చదువుతుంటుంది. రౌడీలలో మంచివాళ్ళు వున్నారంటూ డైలాగ్ చెబుతుంది. ఇది ఓ మంచి రౌడీ కథగా దర్శకుడు హింట్ ఇచ్చాడు.
రేటింగ్: 2/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్