Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది : చిరంజీవి

Advertiesment
ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది : చిరంజీవి
, శనివారం, 22 ఆగస్టు 2020 (16:53 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీ శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా ఫ్యాన్స్‌తో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, చిరంజీవి కూడా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
"అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రేమే నా జీవితంలో లభించిన మహత్తరమైన అదృష్టంగా భావిస్తాను. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ పేర్కొన్నారు. 
 
అన్నయ్యే నా తొలి గురువు : పవన్ కళ్యాణ్ 
తన అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఆని ఎమోషనల్‌ అయ్యారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగి, తనలాంటి ఎందరికో స్ఫూర్తిప్రధాతగా నిలిన వ్యక్తి చిరంజీవి అని​ కొనియాడారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
webdunia
 
అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్‌ గుర్తుచేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగిడారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసిందన్నారు. 
 
ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులకు సేవ అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు. 
 
అటువంటి కృషీవలుడికి తప్పుడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగువారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాు. ఆయనకు చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆచార్య' రూపంలో మెగా సర్‌ప్రైజ్ ... 'ధర్మస్థలి' దద్ధరిలిపోయింది..