Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవినాష్ సేవ్ అయ్యాడు... బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్..?

Advertiesment
అవినాష్ సేవ్ అయ్యాడు... బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్..?
, సోమవారం, 9 నవంబరు 2020 (11:38 IST)
బిగ్ బాస్ సీజన్ 4కు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. మే బీ డబుల్ ఎలిమినేషన్ ఏమో అని నాగ్ అనడంతో అరియానా దుఃఖం మరింత పెరిగింది. అందరిని లివింగ్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున ఓసారి స్టోర్ రూంలోకి వెళ్ళి చూడమని చెప్పాడు. 
 
అందులో అవినాష్ ఏడుస్తూ కనిపించాడు. బయటకు వచ్చాక కూడా అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో సేవ్ అయిన కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. జీరోకు వచ్చాను, బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది అని అన్నాడు. అవినాష్ సేవ్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించడంతో మాస్టర్ డైరెక్ట్‌గా స్టేజ్ పైకి వచ్చారు. 
 
అతనితో నాగార్జున అసలు ఎవరు, నకిలీ ఎవరు అని చెప్పాలని అన్నారు. దీంతో సోహైల్‌, లాస్య, అరియానా, మోనాల్, మెహబూబ్, అవినాష్‌.. అసలు అని, అఖిల్‌, అభిజిత్‌, హారికలను నకిలీ జాబితాలోనే చేర్చాడు మాస్టర్. ఇక కెప్టెన్‌గా ఉన్న మాస్టర్ బయటకు వెళ్లడంతో యాక్టింగ్ కెప్టెన్‌గా మెహబూబ్‌ని నియమించారు. దీంతో 64వ ఎపిసోడ్‌కు ముగింపు కార్డ్ పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ సుమ..? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లిందా?