Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేకింగ్ న్యూస్.. బిగ్ బాస్ హోస్ట్‌గా జబర్దస్త్ జడ్జి రోజా..?! (video)

Advertiesment
Jabardasth
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:22 IST)
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ రేటింగ్ సక్సెస్ రూటులో పోతోంది. ఈ సీజన్‌కు కూడా టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు నాగార్జున గుడ్ బై చెప్పబోతున్నాడనే విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇపుడా ప్లేస్‌లో ముందుగా రమ్యకృష్ణను అనుకున్నారు. తాజాగా కొన్ని ఎపిసోడ్స్‌కు రోజా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే రోజా.. జబర్ధస్త్ వంటి కామెడీ షో జడ్జ్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ వారంతో బిగ్‌బాస్ ఆరో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ఏడో వారంలో అడుగుపెట్టబోతుంది.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో ఫైనల్ ఎపిసోడ్ దాకా నాగార్జున ఉండకపోవచ్చనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఈ సారి 10 వారాలే బిగ్‌బాస్ షోను రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బిగ్‌బాస్ షో నిర్వాహకులు. 
 
ఒకవేళ రేటింగ్స్ వస్తే.. మరో నాలుగు వారాలు పొడించే ఆలోచనలో ఉన్నారు. కానీ నాగార్జున ఇప్పటికే 'వైల్డ్ డాగ్' సినిమాకు బల్క్ డేట్స్ కేటాయించాడు. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం నాగ్ బిగ్ బాస్ షోకు దూరమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కోసం పర్మిషన్లు దొరకడంతో బిగ్ బాస్ షోకు నాగ్ తప్పనిసరిగా దూరం కావాల్సిన పరిస్థితి. 
webdunia
Nagarjuna
 
ప్రస్తుతం మన దేశానికి పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్‌లు రోజు కవ్విస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అందుకే అక్కడ త్వరగా షూటింగ్ ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వైల్డ్ డాగ్ సినీ దర్శక నిర్మాతలు. అందుకే బిగ్‌బాస్ చివరి ఎసిపోడ్ నాగార్జున కాకుండా వేరే ఎవరితోనైనా చేయించాలనే ఆలోచనలో ఉన్నారట స్టార్ మా యాజమాన్యం. 
 
ముందుగా ఆయా ఎపిసోడ్స్‌ను రమ్యకృష్ణతో చేయించుకోవాలన్నారు. కానీ చివరిగా తెలుగు రాష్ట్రాల్లో మాస్‌లో ఫాలోయింగ్ ఉన్న రోజాతో చేయించాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ షోలో పాల్గొనడానికి రోజా ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఆమె పాల్గొనేది కొన్ని ఎపిసోడ్స్ అయినా.. ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తంగా నాగార్జున ప్లేస్‌లో ఒకటి రెండు వారాలు రోజా హౌస్‌ను ఎలా హోస్ట్ చేస్తుందో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ సింగ్ కుమార్ సనుకు కరోనా పాజిటివ్