Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

బిగ్ బాస్ షోలో నెక్ట్స్ ఏం జరుగబోతోందంటే..? టార్గెట్ ఎవరు?

బిగ్ బాస్ ఇంట్లో ఊహించినదే జరిగింది. మూడోవారం తరువాత కిరీటి ఎలిమినేట్ అయ్యారు. గణేష్ వెళ్లిపోతారని ముందుగా భావించినా… సెలబ్రిటీ లను వదిలేసి సామాన్యుల కేటగిరీలో వచ్చిన వారిని ముందుగా పంపేస్తున్నారని బి

Advertiesment
Big Boss Telugu 2 show review
, మంగళవారం, 3 జులై 2018 (16:05 IST)
బిగ్ బాస్ ఇంట్లో ఊహించినదే జరిగింది. మూడోవారం తరువాత కిరీటి ఎలిమినేట్ అయ్యారు. గణేష్ వెళ్లిపోతారని ముందుగా భావించినా… సెలబ్రిటీ లను వదిలేసి సామాన్యుల కేటగిరీలో వచ్చిన వారిని ముందుగా పంపేస్తున్నారని బిగ్ బాస్ మీద వచ్చిన విమర్శను తప్పించుకునేందుకా అనేట్లు సెలబ్రిటీ కిరీటీని ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేషన్ నిర్ణయిస్తున్నట్లు చెబుతున్నా… షో అవసరాలకు అనుగుణంగా కొన్ని ఫిక్సింగులు ఉంటాయన్నది బహిరంగ రహస్యం. అదే ఈ ఆదివారం జరిగింది.
 
కిరీటి వెళ్లిపోయేటప్పుడు హౌజ్‌మేట్స్ కళ్లలో బాధ, అభిమానం స్పష్టంగా కనిపించాయి. గతవారం కెప్టెన్ టాస్క్ సందర్భంగా కౌశల్ కళ్లలో నిమ్మకాయ పెట్టేందుకు కిరీటి ప్రయత్నించడంతో అతనిపై నెగెటివ్ అభిప్రాయం సర్వత్రా వెళ్లిపోయింది. దానివల్ల ఓట్లు తగ్గాయని నాని స్వయంగా వివరించారు. ఓట్లు తగ్గినా ఎక్కువ వచ్చినా కిరీటీని తప్ప ఇంకొకరిని బయటకు పంపలేని స్థితి బిగ్ బాస్‌ది.‌ వినోదం కోసం గీతా మాధురి ఇంట్లో ఉండటం అవసరం. ఇక గణేష్‌ను పంపితే అపవాదు వస్తుంది. దీంతో కిరీటీ బౌల్డ్ అయ్యారు.
 
ఇక ఆదివారం ఒక్కో ఇంటి సభ్యున్ని ఉద్దేశించి ఒక సినిమా పేరు చెప్పి అది ఆ సభ్యునికి సరిపోతుందా లేదా అని మిగతా సభ్యులను అడిగారు. ఇది అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమంటే… ఎవరినీ నొప్పించకుండా సరదాగానే తన పని పూర్తి చేశారు నాని. అందుకు నానిని అభినందించాలి. ఈ వారం బిగ్ బాంబ్ ఏమంటే‌… బాత్‌రూంలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయమంతా బాక్సింగ్ గ్లౌజ్ చేతులకు ధరించే ఉండాలి. ఈ బాంబు గీతా మాధురిపైన పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచారం కోసం వెళ్లలేదు.. వీకెండ్ హాలిడేకు వెళ్లానంటున్న హీరోయిన్