Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!

Advertiesment
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (08:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా - దగ్గుబాటి రానా విలన్‌గా సాగర్ చంద్ర కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "భీమ్లా నాయక్". త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21వ తేదీ రాత్రి నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ వేడుకను వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఒకవేళ ఈ వేడుక జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అతిథులుగా హాజరుకానున్నారు. 
 
మరోవైపు 'భీమ్లా నాయక్' ట్రైలర్‌ను సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏడు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. కాగా, ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు నటించగా, తమన్ సంగీతం సమకూర్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

bheemla nayak ట్రెయిలర్ రిలీజ్: నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ