Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 6న "భరత్ అనే నేను" మూవీ ప్రోమో 6 గంటలకు

ప్రిన్స్ మహేశ్ బాహు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం ఫస్ట్ తాజాగా రిలీజ్ చేశారు.

మార్చి 6న
, సోమవారం, 5 మార్చి 2018 (16:48 IST)
ప్రిన్స్ మహేశ్ బాహు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం ఫస్ట్ తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటలకు మరో ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు ట్విట్ చేసింది. 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' పేరుతో ఓ వీడియో బైట్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
 
కుర్చీపై చెయ్యేసి సీరియస్‌గా ఉన్న మహేష్‌.. వెనకాలే స్క్రీన్‌ మీద ఫస్ట్‌ ఓత్‌‍లోని పదాలు గమనించవచ్చు.  మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో అలరించబోతున్న ఈ  మూవీలో బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఏప్రిల్‌ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మహేష్‌కి "శ్రీమంతుడు" వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త చెప్పాడని శ్రీదేవి అలా చేసింది.. తట్టుకోలేక పోయా.. కుమిలి ఏడ్చాను : అరవింద్