Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాట‌కు క‌ట్టుబ‌డ్డ బాల‌కృష్ణ‌

మాట‌కు క‌ట్టుబ‌డ్డ బాల‌కృష్ణ‌
, సోమవారం, 15 మార్చి 2021 (20:46 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాల‌వైపు, మ‌రోవైపు కేన్స‌ర్ ఆసుప‌త్రి ప‌నులు చూస్తున్నారు. ఇక సినిమాప‌రంగా ఆయ‌న చాలాకాలంగా చేస్తుంది బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే. వీరి కాంబినేష‌న్‌లో ఇది మూడ‌వ సినిమా. పూర్తి ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పలు పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా గాడ్ ఫాథర్ అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్య పరాజయాలతో సతమతమవుతున్న బాలకృష్ణ మంచి హిట్ సినిమాతో వచ్చెనందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు.
 
ఇక బోయ‌పాటి సినిమా దాదాపు పూర్తీ కావొచ్చింది. ఈ సినిమా తరువాత అయన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో రచయిత ఎమ్ రత్నం, బాలయ్య కోసం ఓ కథను రాశాడని, ఇప్పటికే బాలయ్యకు కథ కూడా వినిపించడం జ‌రిగింద‌ని తెలిసింది. ఇందుకు కథ బాగా నచ్చడంతో బాల‌య్య‌ ఒకే చెప్పాడ‌ని స‌మాచారం. ఇది ఫుల్ యాక్షన్ నేపథ్యంతో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా వుంటుంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత‌కుముందు వీరి కాంబినేష‌న్‌లో `డిక్టేట‌ర్‌` సినిమా వ‌చ్చింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బాల‌య్య శ్రీ‌వాస్‌కు మ‌రో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చాడ‌ని అప్ప‌ట్లోనే తెలియ‌జేశారు. 2016లో తీసిన ఆ సినిమా త‌ర్వాత మ‌ర‌లా ఇన్నేళ్ళ‌కు వీరి కాంబినేష‌న్ సెట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా 'మేజ‌ర్' గ్లిమ్స్ విడుద‌ల‌