Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోటీ ఉండాలి... పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : చిరంజీవికి బాలకృష్ణ కౌంటర్

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి". ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలో పాత

పోటీ ఉండాలి... పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : చిరంజీవికి బాలకృష్ణ కౌంటర్
, మంగళవారం, 10 జనవరి 2017 (12:59 IST)
నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి". ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలో పాత్ర చేస్తున్నప్పుడు ఆహార్యం, గెటప్‌లు అదిరిపోయాయని చెప్పారు.
 
ఆ సమయంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారి పాత్రలు చూస్తూ లీనమైపోయాయని చెప్పారు. అందువల్లే ఆ పాత్రలు చేస్తున్నంత సేవు తనలో ఆవేశం, కోపం, రౌద్రం వంటివి ఉన్నాయన్నారు. ముఖ్యంగా.. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మన పూర్వీకులను తలచుకుంటానని చెప్పారు. 
 
ఇకపోతే ఏపీ రాజధాని అమరావతి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' అమరావతి రాజు. అయితే, ఈ చిత్రాన్ని ముందుగా ప్లాన్ చేసుకుని చేయలేదన్నారు. యాదృచ్ఛితంగా కలిసి వచ్చిందని బాలయ్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అంటే, ఇలాంటి చిత్రంలో నటించాలని తనను ఏవో శక్తులు ప్రేరేపించినట్టుగా వచ్చాయన్నారు. 
 
అలాగే, సంక్రాంతి సినీ సమరంపై ఆయన స్పందిస్తూ సాధారణంగా ఎక్కడైనా పోటీ అనేది ఉండాలన్నారు. పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది. తన ఒక్కడి చిత్రమే ఆడితే.. తానేదో బిల్డప్‌ ఇస్తున్నాడని అనుకుంటారు. అది కాదు పద్దతి. పోటీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాగే, ప్రతి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. తనకు ఉండే అభిమానులు తనకు ఉంటారనీ, కానీ కొన్ని పాత్రలు కొందరే చేయగలుగుతారని అందవల్ల ప్రతి ఒక్కరూ ప్రతి అభిమాని చిత్రాన్ని చూడాలన్నారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150" గురించి సోమవారం మాట్లాడుతూ సంక్రాంతి రేసులో పోటీ అనేది లేదని, కేవలం ఇది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. కానీ, బాలయ్య మాత్రం పోటీ ఉండి తీరాల్సిందేనంటూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొందరు హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు.. అర్థమైందా? విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్‌బాబు